2024లో జరిగే లోక్సభ ఎన్నికల్లో సస్పెండ్ అయిన బీజేపీ నేత నుపుర్ శర్మ ఢిల్లీ నుంచి పోటీ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) నేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.
Varun Gandhi: ఇందిరాగాంధీ మనుమడు, మేనకా- సంజయ్ గాంధీల వారసుడు వరుణ్ గాంధీ బీజేపీని వీడే సూచనలు కనిపిస్తున్నాయి. ఆయన త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం.
Congress leader's son arrested by NIA for ISIS connection: కర్ణాటకలో ఐసిస్ ఉగ్రవాద లింకులు బయటపడుతున్నాయి. ఏకంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ కీలక నేత కొడుకే ఐఎస్ఐఎస్ సంబంధాలు ఉన్నాయి. దీంతో ఇటీవల జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) రేషాన్ షేక్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసింది. అతడితో పాటు హుజైర్ ఫర్హాన్ బేగ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసింది ఎన్ఐఏ. రేషాన్ షేక్ ఉడిపి జిల్లాకు చెందిన వాడు కాగా.. ఫర్హాన్ బేగ్…
Sri Ram Sene Leader Injured After Being Shot: కర్ణాటక రాష్ట్రంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. బెలగావిలో శ్రీరామ్ సేన నేతపై దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. హిందాల్గా గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు శ్రీరామ్ సేన జిల్లా అధ్యక్షుడు రవికుమార్ కోకిట్కర్ తుపాకీతో కాల్పులు జరిపారు. శ్రీరామ్సేన కార్యకర్తలు హిందుత్వం కోసం నిలబడతారని, ఇలాంటి దాడులకు భయపడబోమని ఆ సంస్థ చీఫ్ ప్రమోద్ ముతాలిక్ ఈ ఘటనను ఖండించారు.
Nitish Kumar comments on population: బీహార్ సీఎం, జేడీయూ అధినేత నితీష్ కుమార్ జనాభా నియంత్రణ, మహిళలపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. దీనిపై ప్రతిపక్ష బీజేపీ దుమ్మెత్తిపోస్తోంది. మహిళలు చదువుకోకపోవడం, పురుషులు అజాగ్రత్తగా ఉండటం వల్ల రాష్ట్రంలో జనాభా నియంత్రణలోకి రావడం లేదని వ్యాఖ్యలు చేశారు. శనివారం జేడీయూ నిర్వహిస్తున్న సమాధాన్ యాత్రలో భాగంగా వైశాలిలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
Akhilesh Yadav: సమాజ్ వాదీ పార్టీ నాయకుడిని పోలీసులు అరెస్ట్ చేయడంతో ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి లక్నో పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో నిరసనకు దిగారు. ఉత్తర్ ప్రదేశ్ సమాజ్ వాదీ పార్టీ కార్యకర్త మనీస్ జగన్ అగర్వాల్ ను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. దీంతో పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ లక్నోలోని పోలీస్ ప్రధాన కార్యాలయం మందు నిరసన తెలిపారు. పోలీసులు చట్టవ్యతిరేకంగా పనిచేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Rahul Gandhi says Congress will form govt in Hindi belt: దక్షిణాదిలో పోలిస్తే ఉత్తరాది రాష్ట్రాల్లో ‘భారత్ జోడో యాత్ర’కు మంచి స్పందన వచ్చిందని రాహుల్ గాంధీ అన్నారు. ఉత్తరాదిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తుందని అన్నారు. హర్యానా కురుక్షేత్రలో ఆయన మీడియాతో ఆదివారం మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ జోడో యాత్ర భయం, ద్వేషం, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి వాటికి వ్యతిరేకమని ఆయన అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు, హిందీ…
Ex Bureaucrats Slam BJP's Pragya Thakur Over "Hindus, Keep Knives" Speech: ‘‘హిందువులు కత్తులను ఉంచుకోండి’’ అంటూ ఇటీవల ఎంపీ ప్రగ్యా సింగ్ ఠాకూర్ (సాధ్వీ ప్రగ్యా) కర్ణాటకలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలంటూ 103 మంది మాజీ బ్యూరోక్రాట్లు లోక్ సభ స్పీకర్ కు బహిరంగ లేఖ రాశారు. ఎంపీపై చర్యలు తీసుకోవాలని లేఖలో డిమాండ్ చేశారు. లోక్ సభ నైతిక కమిటీ చర్యలు తీసుకోవాలని వారు కోరారు.