Ayodhya's Ram Mandir Will Be Ready By Jan 1, 2024- Amit Shah's Big Announcement: అయోధ్య రామమందిరంపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. జనవరి 1, 2024కి రామ మందిరం సిద్ధం అవుతుందని ప్రకటించారు. బీజేపీ ‘జన్ విశ్వాస్ యాత్ర’ త్రిపురలో ప్రారంభించిన అమిత్ షా ఈ ప్రకటన చేశారు. త్రిపురలో మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో బీజేపీ తన ప్రచారాాన్ని ప్రారంభించింది.…
2 లక్షల మంది పోలీస్ అభ్యర్థుల విన్నపాన్ని వినే సమయం సీఎం కు లేదా? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. బీజేవైఎం కార్యకర్తలు, పోలీసు పరీక్ష అభ్యర్థుల అరెస్టును ఖండించారు.
ఆంధ్రప్రదేశ్ బీజేపీలో జిల్లాల అధ్యక్ష పదవుల మార్పు కలకలం సృష్టిస్తోంది.. ఇటీవలే ఆరు జిల్లాలకు అధ్యక్షులను మార్చేశారు బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు.. మార్చిన జిల్లాల అధ్యక్షులకు రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా పదవులు కట్టబెట్టారు.. అయితే, ఏకపక్షంగా పదవులను మార్చారంటూ పార్టీ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు నేతలు.. పార్టీ పదవికి రాజీనామా చేశారు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, శ్రీకాకుళం జిల్లా ఇంఛార్జ్ చిగురుపాటి కుమారస్వామి.. కృష్ణా జిల్లాలోని వివిధ విభాగాల పదవులకు రాజీనామాలు చేశారు పలువురు…
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ ప్రత్యామ్నాయం తామేనంటూ చెప్పుకుంటున్న భారతీయ జనతా పార్టీలో పదవలు నుంచి నేతల తొలగింపు, రాజీనామా పర్వం కొనసాగుతుందనే ప్రచారం సాగుతోంది.. దానిపై ఆ పార్టీ నేతలే స్వయంగా మీడియా ముందుకు రావడం చర్చగా మారింది.. అయితే, మా పార్టీలో ఎవరూ రాజీనామాలు చేయలేదు అంటున్నారు.. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ రాజు.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వైఎస్ జగన్ ప్రభుత్వం ఉద్యోగస్తుల జీతాలకు ఒక డేట్ లేకుండా చేసిందని ఆరోపించారు..…
కర్ణాటకలో వచ్చే ఏప్రిల్/మే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ జరగనుందని పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ నిర్వహించిన మొదటి ట్రాకర్ పోల్ సర్వేలో వెల్లడైంది.
లేటు వయస్సులోనూ కొందరు నేతలు చక్రం తిప్పుతున్నారు.. పదవుల కోసం పాకులాడుతున్నారు.. పంచాయితీలు కూడా పెడుతున్నారు.. మరికొందరు పార్టీలు మారి.. కొత్త పార్టీలో ఇమడలేకపోతున్నారు.. ఇప్పుడు జరిగిన ఓ పరిణామం చూస్తుంటే.. అదే నిజమా? అనే అనుమానాలకు తావిస్తోంది. ఎందుకంటే, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత ఎస్ఎం కృష్ణ క్రియాశీల రాజకీయాలకు గుడ్‌బై చెప్పేశారు.. దానికి ప్రధాన కారణం తన ఏజ్‌గా చెప్పుకొచ్చారు.. ఇక, రాజకీయాలకు దూరంగా ఉంటాను అని ప్రకటించిన ఆయన.. 90 ఏళ్ల…
నిరుద్యోగంపై కేంద్రంలో, మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వాలను విమర్శిస్తూ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.దేశంలో నిరుద్యోగం కారణంగా పెళ్లి వయసులో ఉన్న యువకులకు వధువులు దొరకడం లేదని ఆయన బుధవారం అన్నారు.
Karnataka Politics: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక సీఎం బస్వరాజ్ బొమ్మై, బీజేపీ నేతలను కుక్కపిల్లలంటూ విమర్శించారు. ప్రధాని మోదీ ముందు వీరంతా కుక్కపిల్లలని.. మోదీని చూస్తే వణికిపోతారంటూ విమర్శించారు. 15వ ఆర్థిక సంఘం కర్ణాటకకు స్పెషల్ అలెవెన్స్ కింద రూ. 5,495 కోట్లు ఇవ్వాలని సిఫారసు చేసినా ఆర్థిక మంత్రి సీతారామన్ ఇవ్వలేదని సిద్దరామయ్య విమర్శించారు.