MP Raghunandan Rao: మెదక్ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత ఎపిసోడ్ ని ఫ్యామిలీ డ్రామాతో పోల్చారు. తెలంగాణలో దేవుళ్ళు ఉన్నారా దెయ్యాలు ఉన్నాయా అన్న విషయంపై చర్చ జరుగుతుంది.. దేవుడి పక్కన దెయ్యం ఉంటే 12 ఏళ్లుగా ఏం చేస్తున్నారు అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని వాళ్లే నాటకం ఆడుతున్నారు.
కల్నల్ సోఫియా ఖురేషిపై మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలు మరువక ముందే.. మరో బీజేపీ నేత.. ఒక ముస్లిం మహిళా ఐఏఎస్ అధికారిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో కర్ణాటకలో తీవ్ర దుమారం రేపింది. ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది.
పహల్గాం దాడిలో ఉగ్రవాదులు ఏ మతం వారో అడిగి మరీ చంపడంతో సహనం పూర్తిగా పోయిందని, అందువల్లే పాకిస్తాన్‌కు భారత్ తిరిగి సమాధానం చెప్పాల్సి వచ్చిందని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. భారతదేశం 1947 నుండి సరిహద్దు ఉగ్రవాదంతో బాధపడిందన్నారు. భారతదేశాన్ని మరింతగా బాధపెట్టకుండా పాకిస్తాన్ వెనక్కి తగ్గడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భారత్ పాక్ పౌరులను లక్ష్యంగా చేసుకోలేదని, ఉగ్రవాద శిబిరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుంది అని పురంధేశ్వరి చెప్పారు.…
BJP: కర్ణాటక బిజెపి ఎమ్మెల్సీ ఎన్ రవికుమార్ ఒక మహిళా ఐఏఎస్ అధికారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపాయి. కలబురిగిలో జరిగిన ఒక సభలో రవి కుమార్ మాట్లాడుతూ.. శాసనమండలిలో ప్రతిపక్ష నేత చలవాడి నారాయణ స్వామి పట్ల వ్యవహరించిన తీరుపై ప్రభుత్వాన్ని విమర్శించారు. కాంగ్రెస్ మద్దతుదారులు ప్రభుత్వ అతిథి గృహాన్ని ముట్టడించిన సమయంలో ఆయన లోపల ఉన్నారు.
త్వరలోనే రాహుల్ గాంధీకి ధన్యవాద సభ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. భారత జోడో యాత్రలో రాహుల్ గాంధీ కీలక నిర్ణయం ప్రకటించాడు.. అధికారంలోకి వస్తే కులగణన చేస్తామని అప్పుడే వెల్లడించారు.. అందులో భాగంగానే.. దేశంలోనే మొట్ట మొదట తెలంగాణలో కులగణన చేశామని వి. హన్మంతరావు తెలిపారు.
వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది.. దేశానికి, తమిళనాడుకు కొత్తదేమీ కాదు అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన ధినేత పవన్ కల్యాణ్.. చెన్నైలో జరిగిన వన్ నేషన్ - వన్ ఎలక్షన్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 1952-67 వరకు దేశంలో ఒకేసారి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు జరిగాయి... వన్ నేషన్, వన్ ఎలక్షన్ అనేది కోరుకున్నది మాజీ సీఎం దివంగత కరుణానిధి .. ఇప్పుడు వారి కూమారుడు స్డాలిన్ వద్దు అంటున్నారు అని మండిపడ్డారు.
కృష్ణా జలాలను వాడుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని కేఆర్ఎంబీ చెప్తుంది.. ఈడీ చార్జ్ షీట్ లో తన పేరు రాగానే సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని వద్దకు వెళ్లారు అని బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి ఆరోపించారు.
చెన్నైలో జరిగిన వన్ నేషన్ వన్ ఎలక్షన్ సమావేశంలో పాల్గొన్న జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. కీలక వ్యాఖ్యలు చేశారు.. తమిళనాడులో చాలాకాలం పాటు పెరిగాను.. తమిళనాడును వదిలి ముప్పై ఏళ్లు అయ్యింది.. నేను తమిళనాడు వదిలి పెట్టి వెళ్లాను.. కానీ, నన్ను తమిళనాడు వదలలేదు.. తమిళనాడు నాపై చాలా ప్రభావం చూపించింది... ఇక్కడే రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక భావన, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను.. అందుకే తమిళనాడు అంటే నాకు ప్రత్యేకమైన గౌరవం,…
Jagga Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు BRS లో నెలకొన్న కుటుంబ తగాదాలు కొత్త దిశగా మలుపుతీస్తున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో గణనీయమైన చర్చనీయాంశంగా మారాయి. జగ్గారెడ్డి వ్యాఖ్యానిస్తూ, రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ముందంజలో ఉందని, BRS రెండో స్థానంలో, బీజేపీ మూడో స్థానంలో ఉన్నదని పేర్కొన్నారు. అయితే, BRS లో ప్రస్తుతం చోటుచేసుకుంటున్న కుటుంబ అంతర్గత విభేదాలు పార్టీకి రాజకీయంగా పెద్ద నష్టాన్ని…
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ తీసుకొన్న చర్యలను ఎంపీ శశిథరూర్ భారత కాన్సులేట్‌లో చెప్పుకొచ్చారు. పహల్గాంలో మతం ఆధారంగా టూరిస్టులపై ఉగ్రవాదులు దారుణానికి ఒడిగట్టారని పేర్కొన్నారు.