హస్తం పార్టీకి శశిథరూర్ తలనొప్పిగా మారారు. కాంగ్రెస్‌లో ఉంటూ ప్రత్యర్థి పార్టీ బీజేపీని ప్రశంసిస్తున్నారు. ఇక పాకిస్థాన్ వైఖరిని అంతర్జాతీయ వేదికపై వినిపించేందుకు ఏర్పాటు చేసిన ఏడు బృందాల్లో కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్‌కు బాధ్యతలు అప్పగించారు.
Congress vs BJP: ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్, పీవోకేలోని ఉగ్ర స్థావరాలను భారత్ ధ్వంసం చేసింది. తాజాగా రైల్వే ఈ- టికెట్లపై ఆపరేషన్ సింధూర్‌కు సంబంధించిన ప్రకటనలు రావడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడుతోంది.
Asaduddin Owaisi: హిందూ ఓట్లను ఏకీకృతం చేయడం వల్లే బీజేపీ దేశవ్యాప్తంగా ఎన్నికల్లో వరసగా గెలుస్తోందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఇందుకు ప్రతిపక్షాల వైఫల్యం కూడా కారణమవుతుందని చెప్పారు. బీజేపీకి ఎంఐఎం బీ-టీమ్ అవునా..? అని ప్రశ్నించిన సమయంలో ఆదివారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తరుచుగా ప్రతిపక్షాలు ఎంఐఎంపై చేసే ఈ ఆరోపణలపై ఓవైసీ స్పందిస్తూ.. ఇది తనను నిందించడానికి, ముస్లింలకు ప్రాతినిధ్యం వహిస్తున్న తన పార్టీ పట్ల ప్రతిపక్షాల ద్వేషం తప్ప…
బండారు సత్యానందరావు.. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట టీడీపీ ఎమ్మెల్యే. ఇన్నాళ్ళు సౌమ్యుడిగా పేరున్న బండారు తీరు ఈసారి మారిందన్న టాక్ బలంగా నడుస్తోంది నియోజకవర్గంలో. ఇప్పుడాయన ఏకంగా నాలుగు ముక్కలాట ఆడుతున్నారట. కూటమిలోని మూడు పార్టీల నాయకులను పక్కనపెట్టి... వైసీపీ వాళ్ళని అందలం ఎక్కిస్తున్నారన్నది ఇప్పుడు కొత్తపేటలో హాట్ సబ్జెక్ట్. అధికారంలోకి వచ్చిన నాటినుండి చాటుమాటుగా కొనసాగుతున్న చెలిమి ఇటీవల ఆయన పుట్టిన రోజు వేడుకల్లో బయటపడిందట.
Rahul Gandhi: పాకిస్తాన్‌పై భారత్ నిర్వహించిన ‘‘ఆపరేషన్ సిందూర్’’పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. ఆపరేషన్‌కి ముందే భారత్ పాకిస్తాన్‌కి సమాచారం ఇచ్చిందని, ఇది నేరం అని ఆయన విమర్శించారు. దీనికి ధీటుగా బీజేపీ బదులిస్తూ, రాహుల్ గాంధీ నకిలీ వార్తలు వ్యాప్తి చేస్తున్నాడని ఆరోపించింది.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు భారత సైనికులు ధీటుగా సమాధానం చెప్పారని తెలిపారు. తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి పాకిస్తాన్ తోక వంకర చేసింది మన సైన్యం.. నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే అన్నారు.
MP DK Aruna: పహల్గామ్ ఉగ్ర దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకోవడంతో.. బీజేపీ ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్ పై తిరంగ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ.. భారతదేశం వైపు కన్నెత్తి చూస్తే మీ దేశం మిగలదని మన సైనికులు సంకేతం ఇచ్చారు.. ఉగ్రవాదులను, దుండగులను ఐక్యతతో అంతం చేస్తామని తేల్చి చెప్పారు.
నరేంద్ర మోడీ పాలనలో భారత జాతి ప్రపంచంలో తలెత్తుకొని తిరుగుతుంది అని ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా దేశం అభివృద్ధి చెందుతోంది.. ఉగ్ర కుట్రలకు ప్రతిఫలం ఏంటో పాకిస్తాన్ చూసింది.. మా దేశ సమగ్రతను దెబ్బ తీసే ప్రయత్నం చేస్తే ఎవ్వరిని వదిలి పెట్టే ప్రసక్తే లేదని సంకేతాలు పాకిస్తాన్ కు ఇచ్చామని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణలో ముక్కోణపు రాజకీయం యమా హాట్ హాట్‌గా మారుతోంది. అదీకూడా.. ఏడాదిన్నర క్రితం వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కేంద్రంగా జరుగుతుండటం ఉత్కంఠను పెంచుతోంది. మొన్నటిదాకా గులాబీ పార్టీని బీజేపీకి బీ టీమ్ అని కాంగ్రెస్ అంటే.. ఆ రెండు పార్టీలు ఒక్కటేనంటూ కాషాయ దళం కౌంటర్స్ వేసింది.
Traffic Restrictions: పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో చేసిన దాడి సక్సెస్ అయిన సందర్భంగా దేశవ్యాప్తంగా బీజేపీ చేపట్టిన తిరంగా యాత్ర రేపు హైదరాబాద్ లో జరగనుంది. హైదరాబాద్‌లో రేపు సాయంత్రం 5 గంటలకు ట్యాంక్‌బండ్ దగ్గర ఈ యాత్ర కొనసాగనుండటంతో.. ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.