Jagga Reddy : కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జగ్గారెడ్డి బీజేపీ నేతలపై, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ముఖ్యంగా రాహుల్ గాంధీపై లేనిపోని విమర్శలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. మీడియాతో మాట్లాడిన ఆయన, దేశ భద్రతపై ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ నిష్క్రియతను పరోక్షంగా ఎండగట్టారు. జగ్గారెడ్డి మాట్లాడుతూ.. పాకిస్తాన్ మిలిటెంట్లు దేశంలోకి చొరబడి 26 మందిని కాల్చి చంపారని, కాశ్మీర్‌లోని పార్క్‌లో ఉగ్రవాదులు హింస సృష్టించేసరికి కేంద్ర ఇంటలిజెన్స్ ఏం చేస్తోంది? అని ప్రశ్నించారు. దేశంలో ఇటువంటి ఘటనలు జరుగుతుంటే ప్రధాని మోదీ రాహుల్ గాంధీ అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వకపోగా, బీజేపీ నేతలు విమర్శలకు పాల్పడటం దుర్మార్గమని చెప్పారు.
Rajamouli: ఫలితం ఏదైనా.. హార్ట్ బ్రేక్ అవుతుంది.. రాజమౌళి ఇంట్రెస్టింగ్ పోస్ట్..!
కిషన్ రెడ్డి, బండి సంజయ్ లాంటి నేతలు రాహుల్ గాంధీపై విమర్శలు చేస్తూ ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. “మీరు నిద్రలో ఉండి విమర్శలు చేస్తే మేము చూస్తూ ఊరుకోం,” అంటూ హెచ్చరించారు. “తప్పులు మీరు చేస్తే, ప్రతిపక్ష నాయకుడిపై నింద వేయడం సరికాదు,” అని స్పష్టం చేశారు.
పాకిస్తాన్‌తో తలెత్తిన ఉద్రిక్తతల సమయంలో దేశ ప్రజలు ప్రధానమంత్రి మోడీ యుద్ధం చేస్తారని భావించారని జగ్గారెడ్డి అన్నారు. కానీ అకస్మాత్తుగా యుద్ధం ఆగిపోయిందని, ఈ ప్రకటనను మోదీ కాకుండా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేయడం విచారకరమని మండిపడ్డారు. “దేశప్రజలకి యుద్ధం ఆగిందని మోదీ చెప్పాల్సినప్పుడు ట్రంప్ చెప్పడమేంటో?” అంటూ ప్రశ్నించారు. ఇదే సందర్భంలో ఇందిరాగాంధీ అధికారంలో ఉన్న సమయంలో అమెరికా జోక్యాన్ని ఎలా తిరస్కరించిందో గుర్తు చేశారు.
వాజ్‌పాయి జన్మదినం రోజున ప్రధాని మోదీ పాకిస్తాన్ వెళ్లడం, అక్కడ నవాజ్ షరీఫ్ తల్లి కాళ్లను మొక్కడం వంటి సంఘటనలను జగ్గారెడ్డి గుర్తుచేశారు. “ఇలాంటి సమయంలో మేమేంటన్నట్లు రాహుల్ గాంధీపై విమర్శలు చేయడం సరైంది కాదు,” అని బీజేపీ నేతలను ఉద్దేశించి అన్నారు. బీజేపీ నేతలు కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై రాహుల్ గాంధీ వేసే ప్రతి ప్రశ్నకు సమాధానం ఇవ్వాలని, లేకపోతే విమర్శలు చేయడం మానుకోవాలి. వాస్తవాలు వెలికి తీయడమే కాంగ్రెస్ బాధ్యత. దాన్ని తప్పుగా చిత్రీకరించబోద్దని ఆయన వ్యాఖ్యానించారు.
Collector Ambedkar: మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పై కలెక్టర్ అంబేద్కర్ ఫైర్..