MLC Kavitha : హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ ప్రాంగణం మంగళవారం ఉదయం ఉద్రిక్త వాతావరణాన్ని చూసింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జారీ చేసిన నోటీసులకు వ్యతిరేకంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగిన ఈ ధర్నాకు భారీ సంఖ్యలో జాగృతి కార్యకర్తలు తరలివచ్చారు. కవిత తన వ్యాఖ్యలతో ఈ వ్యవహారాన్ని పూర్తిగా రాజకీయ కుట్రగా అభివర్ణించారు. “కేసీఆర్ గారికి నోటీసులు జారీ చేసిన తీరు పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నది. ఆయన చేసిన అభివృద్ధి పనులన్నీ ఇప్పుడు కుట్రలుగా మలచాలని చూస్తున్నారు. తెలంగాణ భూములకు నీళ్లు ఇచ్చిన నాయకుడికి ఈ విధంగా నోటీసులు ఇవ్వడం అన్యాయం,” అంటూ తీవ్రంగా మండిపడ్డారు.
Nara Lokesh: విధ్వంసపాలనపై ప్రజలు గెలిచారు.. ఐదు కోట్ల ప్రజలకు కృతజ్ఞతలు!
కవిత మాట్లాడుతూ, కేసీఆర్ తన గట్టి గుండెతోనే కాళేశ్వరం లాంటి మహత్తర ప్రాజెక్టును నిర్మించారని చెప్పారు. “ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 40 లక్షల ఎకరాలకు నీళ్లు అందించబడ్డాయి. ఇలాంటి ప్రాజెక్టుపై ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. కాళేశ్వరం కమిషన్ కాదు, ఇది కాంగ్రెస్ కమిషన్. ప్రాజెక్టును బద్నాం చేయడమే వారికి గోల్,” అని విమర్శించారు. బీజేపీపై కూడా కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “తెలంగాణ బీజేపీ నేతలు కేంద్రాన్ని ప్రశ్నించడం లేదు. ఎన్డీఏలో చంద్రబాబు ఉన్నాడన్న కారణంతో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని పట్టించుకోవడం లేదు. ఒకే ఒక తెలంగాణ బిడ్డ ఈటల రాజేందర్ కూడా నోరు విపించకపోవడం శోచనీయం. ఆయన కనీసం బకనచర్ల ప్రాజెక్టు విషయానికైనా స్పందించాలి. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకురావాల్సిన బాధ్యతను కూడా ఈటల తీసుకోవాలి,” అన్నారు.
ఈ ధర్నా సందర్భంగా పోలీసులు జాగృతి కార్యకర్తలను అరెస్ట్ చేసిన అంశాన్ని కూడా కవిత తీవ్రంగా ఖండించారు. “మంచిర్యాల, రామగుండం ప్రాంతాల నుంచి ధర్నాకు వస్తున్న కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేయడం ఎంత దుర్మార్గం. ధర్నాను అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఊరుకోబోము. హైదరాబాద్‌లో అవకాశం ఇవ్వకపోతే, జిల్లాల్లో, గల్లీల్లో ధర్నాలు చేస్తాం. ఇది ఉద్యమం,” అని స్పష్టం చేశారు. తుదిగా, గోదావరి నీటిపై తెలంగాణకు వున్న హక్కును సాధించే వరకు తమ పోరాటం ఆగదని, తెలంగాణ జాగృతి ఉద్యమం మరోసారి సజీవంగా మారిందని కవిత జోష్ చూపించారు. ఈ ధర్నా ద్వారా కవిత తిరిగి బలమైన రాజకీయ చైతన్యాన్ని ప్రదర్శించినట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Spying: జ్యోతి మల్హోత్రాతో సంబంధం ఉన్న మరో యూట్యూబర్ అరెస్ట్