తమిళనాడులో ప్రతిపక్ష అన్నాడీఏంకే, బీజేపీ మధ్య వివాదంతో ఇరు పార్టీల మధ్య దూరం పెరుగుతోదని ప్రచారం జరుగుతోంది. ఏఐఏడీఎంకే-బీజేపీ మధ్య విభేదాలు తలెత్తినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. కూటమికి కూటమికి బీటలువారనున్నాయా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్న తరుణంలో ఇరు పార్టీలకు చెందిన కీలక నేతలు సమావేశం అయినట్లు సమాచారం. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు కొనసాగించేందుకు అన్నాడీఎంకే సుముఖత వ్యక్తం చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
Also Read:Dantewada: దంతెవాడలో మావోయిస్టులు భద్రతా అధికారులను ఎలా ట్రాప్ చేశారు?
ఎఐఎడిఎంకె ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె పళనిస్వామి న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమైనట్లు రెండు పార్టీల మధ్య తలెత్తిన వివాదంపై చర్చించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ సమావేశానికి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు తమిళనాడు బీజేపీ చీఫ్ కే అన్నామలై కూడా హాజరయ్యారు. వచ్చే ఎన్నికల్లో పొత్త కొనసాగించాలని ప్రధానంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. బీజేపీ నాయకత్వం కూడా తమిళనాడులో పొత్తు కొనసాగాలని కోరుకుంటున్నామని నొక్కి చెప్పింది. గత ఎన్నికల మాదిరిగానే చివరి నిమిషంలో గందరగోళం తలెత్తకుండా ఉండేందుకు బీజేపీ పోటీ చేసే స్థానాలపై కూడా సమావేశంలో చర్చించారు.
Also Read:CM KCR : బీఆర్ఎస్ పార్టీ ఒక రాష్ట్రానికి చెందిన పార్టీ కాదు
2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు అన్నామలై అన్నామలై ఏఐఏడీఎంకేతో పొత్తును బీజేపీ రద్దు చేసుకోకపోతే తాను పదవికి రాజీనామా చేస్తానన్న నిర్ద్వంద్వ వైఖరి రెండు పార్టీల శ్రేణుల్లో గందరగోళాన్ని సృష్టించింది. కూటమిలో కొనసాగాలని బీజేపీ జాతీయ నాయకత్వం నిర్ణయించుకుంటే పార్టీ రాష్ట్ర చీఫ్ పదవికి రాజీనామా చేస్తానని అన్నామలై బెదిరించారు. అయితే, తాను కార్యక్తగా కొనసాగుతానని చెప్పారు. తమిళనాడులో రెండో సారి కూడా బీజేపీ ఎదగదని అన్నామలై అభిప్రాయపడ్డారు.