మరోసారి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై నిప్పులు చెరిగారు టీపీసీసీ రేవంత్ రెడ్డి. రాష్ట్రం వచ్చినప్పుడు 1లక్ష 7 వేల ఉద్యోగాల ఖాళీ ఉన్నాయని, ఇప్పుడు 2లక్షల ఉద్యోగాలు ఖాలీ ఉన్నాయన్నారు. అంటే ఉద్యోగాలు భర్తీ ఎక్కడ చేసారని ఆయన ప్రశ్నించారు. కుటుంబం, కులపోల్లు చుట్టు పోల్లు పదవుల్లో ఉన్నారని, ప్రభుత్వంలో ఉన్న రెండు లక్షల ఖాళీలను ఎందుకు భర్తీ చేయడం లేదన్నారు రేవంత్ రెడ్డి. నిరుద్యోగ నిరసన ర్యాలీ లో భాగంగా అంబేడ్కర్ సెంటర్ లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రశ్న పత్రాలు సంతలో పశువుల అమ్ముకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణ కు ప్రియాంక గాంధీ వస్తున్నారు.
Also Read : మూడు పూటలా అన్నమే తింటున్నారా.. ఈ సమస్యలు తప్పవు!
ఆదిలాబాద్ జిల్లా ను కాంగ్రెస్ దత్తత తీసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చిన వెంటనే 2లక్ష ల ఉద్యోగాల భర్తీ చేస్తాం.. ఆదిలాబాద్ లో జోకుడు రామన్న. అక్కడ జోకు మను.. ఆ జోకుడు తో మంత్రి అయ్యాడు అయన కొడుకు మున్సిపల్ చైర్మన్ అయిండు. ప్రశ్న పత్రాలు లీకేజీ లో కేసీఅర్ కొడుకు ను భర్తరఫ్ చేయాలి. బండి సంజయ్ పై మాట్లాడుతున్నారు. అమిత్ షా పై, ప్రశ్న పత్రాలు లీకేజీ పై ధర్నా చేస్తే అయిదు రోజులు బెయిల్ రాలే.. కానీ పేపర్లు అమ్ముకున్న బండి సంజయ్ తెల్లారి బయటకు వచ్చాడు. ఇవి కుమ్మక్కు రాజకీయాలకు నిదర్శనం కాదా. ఆదిలాబాద్ లో పది అసెంబ్లీ స్థానాలు గెలిపిస్తే … నేను రాష్ట్రంలో 90 అసెంబ్లీ స్థానాలు గెలిపించి అధికారంలోకి తీసుకొస్తాం.’ అని ఆయన అన్నారు.
Also Read : Andhrapradesh: ఏపీలో సబ్ రిజిస్ట్రార్, తహశీల్దార్ కార్యాలయాల్లో ఏసీబీ దాడులు