కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ ఒక పార్టీ మీద మరో పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో ఆరోపణలు, విమర్శలు చేసుకుంటున్నారు. కేంద్ర హోంమత్రి అమిత్ షాకు జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని హెచ్ డీ దేవేగౌడ స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం హాట్ టాఫిక్ అయ్యింది. మా పార్టీకి డబ్బులు లేకపోవచ్చు.. అయితే ప్రజల ఆశీర్వాదం ఉందని.. అందుకే తాము ఒంటరిగా పోరాటం చేస్తున్నామని.. ఏదైనా మాట్లాడేటప్పుడు వెనుక ముందు ఆలోచించి మాట్లాడాలని మాజీ ప్రధాన మంత్రి హెచ్ డీ. దేవేగౌడ.. అమిత్ షాకు కౌంటర్ ఇచ్చాడు.
Also Read : YS Sunitha Reddy: టీడీపీలోకి వైఎస్ సునీత..? అసలు కారణం ఇదేనా..?
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చెయ్యడానికి కేంద్ర మంత్రి అమిత్ షా కర్ణాటకలో పర్యటిస్తున్నారు. సోమవారం హుబ్బళిలో మీడియాతో మాట్లాడిన అమిత్ షా కాంగ్రెస్ పార్టీకి బీ టీమ్ గా జేడీఎస్ పార్టీ వ్యవహరిస్తోందని.. జేడీఎస్ కు ఓటు వేస్తే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినట్లే అని.. జేడీఎస్ పార్టీ కుటుంబ రాజకీయాలు చేస్తోందని కేంద్ర హోంమత్రి అమిత్ షా ఆరోపించారు.
Also Read : Vijay Deverakonda: ముంబైలో ‘మ్యూజిక్ స్కూల్’ ట్రైలర్ ఆవిష్కరణ!
ఇక మంగళవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అమిత్ షా మరోసారి జేడీఎస్ పార్టీని బీ టీమ్ తో పొల్చారు. దీంతో మాజీ ప్రధాని హెచ్ డీ దేవేగౌడ.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిగత విమర్శలు చేస్తే మేము.. మా పార్టీ నాయకులు పెద్దగా పట్టించుకోరని.. అయితే పార్టీ పేరుతో విమర్శలు చేస్తే సహించేది లేదని మాజీ ప్రధాని దేవేగౌడ హెచ్చరించారు.
Also Read : Redya Naik : మరోసారి రేవంత్ రెడ్డిపై రెడ్యానాయక్ ఫైర్
మాజీ సీఎం కుమారస్వామి ఆధ్వర్యంలో మా జేడీఎస్ పార్టీ 207 స్థానాల్లో స్వతంత్రంగా పోటీ చేస్తున్నదని.. మూడు స్థానాల్లో సీపీఐ, మూడు స్థానాల్లో ఆర్పీఐ, మరో చోట మరో వ్యక్తికి మద్దతు ఇస్తున్నామని.. ప్రతిరోజు 3 నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల తరపున మేము ప్రచారం చేస్తున్నామని మాజీ ప్రధాని హెచ్ డీ దేవేగౌడ గుర్తు చేశారు. మా పార్టీ మీద విమర్శలు చేసే ముందు మీ పార్టీ గురించి ఆలోచించుకోండి అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు హెచ్ డీ దేవేగౌడ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.