Kolkata Student Case: కోల్‌కతా లా కాలేజీ క్యాంపస్‌లో 24 ఏళ్ల విద్యార్థినిపై ముగ్గురు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన సంచలనంగా మారింది. నిందితుల్లో ఒకరు అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) విద్యార్థి విభాగం నేత కావడంతో ఈ కేసు రాజకీయంగా చర్చకు దారి తీసింది. గతేడాది ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌లో పీజీ వైద్యురాలిపై అత్యాచార ఘటన మరిచిపోక ముందే ఈ సంఘటన జరిగింది.
Read Also: POK: భారత్‌పై భారీ కుట్రకు సిద్ధమవుతున్న పాక్..? ధ్వంసమైన ఉగ్ర శిబిరాల పునర్నిర్మాణం..?
కోల్‌కతాలోని కస్బా ప్రాంతంలోని సౌత్ కలకత్తా లా కాలేజీ మాజీ విద్యార్థి మనోజిత్ మిశ్రా(31)తో సహా ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అత్యాచారం సమయంలో వీడియోలు తీసిన ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అయితే, ప్రధాన నిందితుడు అధికార టీఎంసీ పార్టీ స్టూడెంట్ వింగ్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. మరో ఏడాదిలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్న తరుణంలో, ప్రధాన నిందితుడితో మమతా బెనర్జీ పార్టీకి ఉన్న సంబంధాలను బీజేపీ సోషల్ మీడియా వేదికగా హైలెట్ చేసింది. టీఎంసీలో మమతా తర్వాత స్థానంలో ఉన్న ఎంపీ అభిషేక్ బెనర్జీతో నిందితుడు మనోజిత్ మిశ్రా ఉన్న ఫోటోని షేర్ చేసింది. బెంగాల్ హెల్త్ మినిస్టర్ చంద్రిమా భట్టాచార్య, సీఎం మమతా బెనర్జీ వదిన, కౌన్సిలర్ కజారీ బెనర్జీతో సహా ఇతర టీఎంసీ నేతలతో నిందితుడు ఉన్న ఫోటోలను ఎక్స్‌లో పంచుకుంది.
Yet again Mamata Banerjee's govt is found standing with the accused!
Accused no 1 Manojit Mishra is a TMC member!
Whether it is RG Kar Rape and Murder case where Mamta Banerjee tried to silence victims parents,
Or now when accused in Kasba gangrape case is found to be a TMC… pic.twitter.com/mYuAYjRgwh
— Pradeep Bhandari(प्रदीप भंडारी)🇮🇳 (@pradip103) June 27, 2025
OUTRAGEOUS! Manojit Mishra, one of the prime accused in the brutal gang-rape of a college student in Kasba has direct links with the most powerful in the TMC:
➡️ MP Abhishek Banerjee
➡️ Councillor Kajari Banerjee (Mamata Banerjee’s sister-in-law)
➡️ State Minister Chandrima… pic.twitter.com/6cnN2iSao4— Amit Malviya (@amitmalviya) June 27, 2025
#WATCH | Kolkata, West Bengal: The three accused of raping a law student in her college premises in the city, being taken to the court. pic.twitter.com/FnmiwPLjMW
— ANI (@ANI) June 27, 2025