Rahul Gandhi: 2024 లోక్సభ ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఎన్డీయే వర్సెస్ ఇండియా కూటమిగా ఈ ఎన్నికలు ఉండబోతున్నాయి. ఇదిలా ఉంటే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీ ఉండనున్నారు.
సీఎం కేసీఆర్ మహారాష్ట్ర కి ఎందుకు వెళ్తున్నారు?.. రాష్ట్ర సంపదను మహారాష్ట్రలో ఎందుకు ఖర్చు చేస్తున్నారు?.. అని ప్రశ్నించారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అని చెప్పిన కవిత బీఆర్ఎస్ పార్టీ ఎంత మంది మహిళలకు ఎమ్మెల్యే అభ్యర్థులుగా టికెట్లు ఇచ్చింది? అని షబ్బీర్ అలీ అడిగారు.
Asaduddin Owaisi: హర్యానాలో గత నెలలో మత ఉద్రిక్తతలకు, అల్లర్లకు కారణమైన నూహ్ ప్రాంతం మరోసారి వార్తల్లోకెక్కింది. విశ్వహిందూ పరిషత్(వీహెచ్పీ) ఈ రోజు శోభాయాత్ర నిర్వహిస్తామని ప్రకటించడంతో నూహ్ తో పాటు మొత్తం హర్యానా హై అలర్ట్ అయింది
శివసేన (యూబీటి) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ఆదివారం అధికార నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ)ను అమీబాతో పోల్చారు. బీజేపీ నేతృత్వంలోని ఫ్రంట్కు ఖచ్చితమైన ఆకారం, పరిమాణం లేదని అన్నారు.
తెలంగాణలో కేసీఆర్ పాలనకు నూకలు చెల్లాయని.. రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఖమ్మం బహిరంగ సభలో స్పష్టం చేశారు. ఆదివారం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు గోస-బీజేపీ భరోసా భారీ బహిరంగ సభకు అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కాంగ్రెస్.. సోనియా కుటుంబం కోసం, బీఆర్ఎస్ కల్వకుంట్ల కుటుంబం కోసం పనిచేస్తుందని ఆరోపించారు.
ఖమ్మంలో బీజేపీ ఆధ్వర్యంలో 'రైతు గోస-బీజేపీ భరోసా' బహిరంగ నిర్వహిస్తుంది. ఈ సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ బండి సంజయ్, ఈటల రాజేందర్, డీకే అరుణ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సునీల్ బన్సల్, పలువురు బీజేపీ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ వ్యవసాయంపై నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు.
Harish Rao: మంత్రి హరీష్ రావు నేడు సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. సాయంత్రం కోమటి చెరువులో దాదాపు 4500 డ్రోన్లతో డ్రోన్ షో నిర్వహణ కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొననున్నారు.