దేశ అంతరిక్ష యాత్రకు ప్రధాని నరేంద్ర మోదీ కొత్త వేగం, శక్తిని అందించారని, చంద్రుని దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన మొదటి దేశంగా భారతదేశం అవతరించిందని హోం మంత్రి అమిత్ షా శనివారం అన్నారు.
అసెంబ్లీ ఎన్నికలకు కేవలం మూడు నెలల ముందు మధ్యప్రదేశ్ మంత్రివర్గ విస్తరణ చేశారు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శనివారం ఉదయం ముగ్గురు మంత్రులను తన కేబినెట్ లో చేర్చుకున్నారు. ముగ్గురు ఎమ్మెల్యేలు రాజేంద్ర శుక్లా, గౌరీశంకర్ బిసెన్, రాహుల్ లోధీకి కేబినెట్ లో చోటు కల్పించారు.
Bandi Sanjay: నేను సీఎం కావాలని అనుకోవడం లేదు.. అనుకునే వాళ్ళు మూర్ఖులని కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
రాబోయే ఎన్నికల్లో బీజేపీ పార్టీ సత్తా ఏంటో తెలుస్తుందని బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తే చంద్రమండలం కూడా ఖతం అవుతుందని సెటైర్లు వేశారు.
Tummala Nageswara Rao: తుమ్మల నాగేశ్వరరావు భారీ కాన్వాయ్తో హైదరాబాద్ నుంచి ఖమ్మంకు బయలుదేరారు. ఖమ్మం వస్తున్న తమ నేతకు ఘనస్వాగతం పలికేందుకు ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి ఆయన అనుచరులు పెద్ద ఎత్తున నాయకన్ గూడెంకు తరలివస్తున్నారు.
Bandi Sanjay: కేసీఆర్ ప్రకటించిన సీట్లన్నీ ఉత్తుత్తివే అంటూ బీఆర్ఎస్ జాబితాపై కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ లోని మంకమ్మతోట 55 డివిజన్ లో కమ్యూనిటీ హాల్ పనులకు శంకుస్థాపన చేశారు.
Etela Rajender: బీజేపీలోకి వెళతారనే భయంతో టికెట్ లు అనౌన్స్ చేశారని బీజేపీ నేత ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాలుగున్నర ఏళ్లలో అన్ని ఎన్నికల్లో ప్రజాస్వామిక పద్దతుల్లో బీజేపీ గెలిచిందని అన్నారు.
అక్టోబర్ రెండో వారంలో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించే అవకాశం ఉంది. దీనికి ముందు బీజేపీ రాజకీయ సమీకరణాలపై కసరత్తు ప్రారంభించింది. అసంతృప్తులను శాంతింపజేసేందుకు పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇప్పుడు పార్టీ ప్రాంతీయ, కుల సమీకరణాలకు అనుగుణంగా మంత్రివర్గాన్ని విస్తరించబోతోంది.