సూర్యాపేట జిల్లాలో నీటిపారుదల సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి పర్యటించారు. ఆత్మకూర్ (ఎస్) మండలం నెమ్మికల్లు వద్ద దండు మైసమ్మ తల్లి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆయన పాటు సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ పాల్గొన్నారు. పూర్ణకుంభంతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి స్వాగతం పలికారు ఆలయ అర్చకులు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్, కేటీఆర్ లాంటి వారు ఎవరు బరిలోకి దిగినా 13 -14 పార్లమెంట్ స్థానాల్లో సునాయాసంగా గెలుస్తామన్నారు.
బీఆర్ఎస్ అహంకారాన్ని ప్రజలు పసిగట్టారని… అందుకే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో పాజిటివ్ అభిప్రాయం మరింతగా బలపడుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అశాభావం వ్యక్తం చేశారు. 6 గ్యారంటీల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా ఉంటుందన్నారు. బండి సంజయ్ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడని ఆయన మండిపడ్డారు. మేమంతా రామ భక్తులమే రామ మందిరం అంశాన్ని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ ఈవెంట్ గా మారుస్తున్నారన్నారు. శంకరాచార్యులు , మఠాధిపతులు రామమందిర ప్రతిష్ఠకు దూరంగా ఎందుకు ఉంటున్నారో బండి సమాధానం చెప్పాలన్నారు ఉత్తమ్ కుమారరెడ్డి.