Congress: కాంగ్రెస్‌కి వ్యూహకర్తలు షాకిస్తున్నారా.. ప్రశాంత్ కిషోర్ తర్వాత సునీల్ కనుగోలు దూరం..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: 2024 సార్వత్రిక ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి. రెండు మూడు నెలల్లో లోక్‌సభ ఎన్నికలకు నగారా మోగబోతోంది. ఇదిలా ఉంటే ఈ సారి బీజేపీని గద్దె దించి కాంగ్రెస్, ఇండియా కూటమి అధికారం చేపట్టాలని గట్టిగా కోరుకుంటున్నాయి. కాంగ్రెస్, టీఎంసీ, జేడీయూ, ఆర్జేడీ, ఆప్ వంటి కీలక పార్టీలు ఇండియా కూటమి పేరుతో కొత్త కూటమిని ఏర్పాటు చేశాయి. అయితే కాంగ్రెస్‌కి మాత్రం కష్టకాలం కనిపిస్తుంది. దేశంలో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్తలుగా సునీల్ కనుగోలు 2024 లోక్‌సభ ఎన్నిలక ప్రచారంలో భాగం కావడం లేదు.
Read Also: Pak Terrorist: ముంబై దాడి కుట్రదారు, లష్కరే కీలక ఉగ్రవాది హఫీజ్ అబ్దుల్ సలామ్ భుట్టవి మృతి
Also Read
కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలుపుకు కీలకంగా వ్యవహరించిన సునీల్ కనుగోలు ఎన్నికల ప్రచారంలో భాగం కావడం లేదు. రెండేళ్ల క్రితం ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ టీం నుంచి వైదొలిగారు. అయితే కనుగోలు హర్యానా, మహారాష్ట్ర ప్రచారాలపై దృష్టి పెడుతున్నారని సంబంధిత వర్గాలు వెల్లడిస్తున్నాయి. అంతకుముందు 2022లో కాంగ్రెస్‌తో కలిసి పనిచేయడం లేదని ప్రశాంత్ కిషోర్ చెప్పారు. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సునీల్ కనుగోలు దూరమయ్యారు.
అయితే, కీలకమైన ఎన్నికల్లో పోల్ స్ట్రాటజిస్ట్ అందుబాటులో ఉండరనే వార్తలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీలో ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న ఓ నాయకుడు అతని గైర్హాజరు పార్టీకి దెబ్బగా అభివర్ణించినట్లు సమాచారం. సునీల్ కనుగోలు క్యాబినెట్ హోదాతో ప్రస్తుతం కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రాథమిక సలహాదారుగా ఉన్నారు. కనుగోలు వ్యూహాలతో బీజేపీ నుంచి కర్ణాటకను, బీఆర్ఎస్ నుంచి తెలంగాణను కాంగ్రెస్ దక్కించుకుంది. అయితే మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో మాత్రం ఆయన వ్యూహాలు విఫలమయ్యాయి.
తాజావార్తలు
-
BJP-GenZ: బీజేపీ వైపు జెన్-జీ? ఢిల్లీ వర్సిటీ ఎన్నికల సందేశం ఇదేనా!
-
Transport Department: రవాణా శాఖ ఉద్యోగ నిబంధనల్లో భారీ మార్పులు.. కీలక ఉత్తర్వులు జారీ..
-
Kejriwal: కేజ్రీవాల్ ఫ్యామిలీలో ఐదుగురికి ‘సర్’ నోటీసులు
-
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన కుండపోత.. ఈదురుగాలులతో హై అలర్ట్.!
-
Pakistan: పాక్‌లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!