కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ చేపట్టిన యాత్రపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా వాడీవేడిగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన వాతావరణం నెలకొన్న ప్రస్తుత సమయంలో రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ వల్ల ఉపయోగం లేదని పీకే విమర్శలు గుప్పించారు.
తెలంగాణలో అత్యధిక ఎంపీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ తెలిపారు. పార్టీ ఇచ్చిన కార్యక్రమాల్ని కింది స్థాయి వరకు తీసుకెళ్ళేందుకు ఈరోజు మీటింగ్ లో చర్చించామన్నారు. పార్లమెంట్ నియోజక వర్గాల్లో ముఖ్య నేతల పర్యటన ఉంటుందని ఆమే పేర్కొన్నారు. అంతేకాకుండా.. ఫిబ్రవరి 5 నుండి 8 వరకు పల్లెకు పోదాం కార్యక్రమంలో భాగంగా కార్యకర్తలు తమకు కేటాయించిన గ్రామంలో 24 గంటలు ఉంటారు.. అక్కడ ప్రజలతో మమేకం అవుతారని…
ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ ముచ్చటగా ఐదోసారి ఈడీ విచారణకు డుమ్మాకొట్టారు. గతంలో నాలుగు సార్లు విచారణకు దూరంగా ఉన్నారు. తాజాగా శుక్రవారం కూడా ఆయన విచారణకు హాజరుకాలేదు.
Arvind Kejriwal: ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్కి ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ నోటీసులు అందించింది. ఇటీవల కేజ్రీవాల్ మాట్లాడుతూ.. బీజేపీ తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తోందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో క్రైమ్ బ్రాంచ్ యూనిట్ శుక్రవారం నేరుగా కేజ్రీవాల్ ఇంటికి వెళ్లింది. అయితే, క్రైమ్ బ్రాంచ్ అధికారులు నోటీసులు ఇవ్వకుండానే వెనుదిరిగినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది. ఆప్ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభాలకు గురిచేస్తుందని
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పదాధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. మరోవైపు ఈ సమావేశంలో రెండు తీర్మానాలకు ఆమోదం తెలిపారు. అయోధ్య రామ మందిరం నిర్మాణం పూర్తిచేసినందుకు మోడీకి ధన్యవాదాలు చెబుతూ తీర్మానం.. వికసిత భారత్ సాకారం చేయడానికి బడ్జెట్ ప్రవేశ పెట్టినందుకు ధన్యవాదాలు చెబుతూ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఫిబ్రవరి ఒకటిన గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు.. ఏమైంది..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్…
Udhayanidhi Stalin: గతేడాది డీఎంకే పార్టీ నేత, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు, క్యాబినెట్ మంత్రిగా ఉన్న ఉదయనిధి స్టాలిన్ ‘సనాతన ధర్మం’పై ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా రాజకీయ దుమారాన్ని రేపాయి. బీజేపీ ఈ వ్యాఖ్యల్ని తప్పు పట్టింది. దేశవ్యాప్తంగా పలు చోట్లు హిందువులు తమ మనోభావాలను దెబ్బతీశాడని చెబుతూ.. ఉదయనిధిపై కేసులు పెట్టారు.
Arvind Kejriwal: చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు అన్యాయమని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఆరోపిస్తోంది. దీంతో ఈ రెండు పార్టీల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఈ రోజు ఆప్ నిరసనకు పిలుపునిచ్చింది. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో బీజేపీ రిగ్గింగ్ చేసి గెలుపొందిందని, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఏ స్థాయికైనా వెళ్లొచ్చని ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈ రోజు కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు.
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాగా.. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకున్నారని తెలిపారు. గత నియంతృత్వ ప్రభుత్వానికి చరమగీతం పాడారన్నారు. రేపు దేశంలోనూ ఇదే పరిస్థితి వస్తుంది.. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.
ఢిల్లీలో ఆప్, బీజేపీల ప్రదర్శన కారణంగా సెంట్రల్ ఢిల్లీతో పాటు రాజధానిలోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఈ నిరసనలను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ పోలీసులు బారికేడ్లు వేసి పలు రహదారులను మూసి వేశారు. దీంతో ప్రత్యామ్నాయ మార్గాల్లో వాహనాల రద్దీ పెరగడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.