ఉమ్మడి పౌర స్మృతి( యూసీసీ ) బిల్లును ఇవాళ ఉత్తరాఖండ్ అసెంబ్లీ ప్రవేశ పెట్టబోతున్నారు. ఇటీవల ఆ బిల్లును రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించింది. భారతీయ పౌరులు అందరికీ ఒకే రకమైన చట్టం ఉండేలా ఈ బిల్లును రూపొందించారు.
పార్లమెంట్ వేదికగా ప్రధాని మోడీ కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కుటుంబ పాలనతో దేశాన్ని కాంగ్రెస్ సర్వనాశనం చేసిందంటూ ప్రధాని వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై లోక్‌సభలో ప్రధాని ప్రసంగించారు.
లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తన పదేళ్ల పదవీకాలంలో సాధించిన విజయాలను ప్రస్తావించారు. తొలి టర్మ్‌లో అభివృద్ధి పథంలో కాంగ్రెస్ సృష్టించిన గుంతలను పూడ్చడానికే కాలయాపన చేయాల్సి వచ్చిందన్నారు. అప్పుడు దేశాభివృద్ధికి పునాది వేశాం, రెండో టర్మ్‌లో దేశం వేగంగా ఎన్నో విజయాలు సాధించిందని తెలిపారు.
లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి సంబంధించిన ధన్యవాద తీర్మానంపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. కాంగ్రెస్‌తో సహా ప్రతిపక్ష పార్టీలపై ప్రధాని మోడీ విరుచుకుపడ్డారు. విపక్షాల తీర్మానాన్ని నేను అభినందిస్తున్నాను అని ప్రధాని మోదీ అన్నారు. విపక్షాలు చాలాకాలం పాటు విపక్షంలోనే ఉండాలనే సంకల్పం తీసుకున్నాయని ప్రధాని ఎద్దేవా చేశారు. మరోవైపు... ఈ రోజు దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు కాంగ్రెస్సే కారణమని దుయ్యబట్టారు. వారసత్వ రాజకీయాలను ప్రొత్సహిస్తూ కేవలం ఒక్కరి కోసమే కాంగ్రెస్ పాకులాడుతోందని…
క్రైమ్ బ్రాంచ్ నోటీసు విషయంలో అరవింద్ కేజ్రీవాల్ బీజేపీని, కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తన ఇంటి ముందు 5 గంటల పాటు క్రైం బ్రాంచ్ అధికారులు డ్రామా ఆడేలా చేసింది బీజేపీ.. అతీషి ఇంటి ముందు 5 గంటల పాటు డ్రామా సాగిందని కేజ్రీవాల్ తెలిపారు. క్రైం బ్రాంచ్ అధికారులు తీసుకొచ్చిన నోటీసులో ఎలాంటి ఎఫ్ఐఆర్ ప్రస్తావన లేదని, ఇప్పటికీ నోటీసుకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చామని తెలిపారు. అయితే ఇలాంటి డ్రామాలు దేశ ప్రగతికి…
దేశ చరిత్రలో ఓ ముఖ్యమంత్రిని అరెస్టు చేసిన చీకటి రోజుగా జనవరి 31 మిగిలిపోతుందని జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ తెలిపారు. జార్ఖండ్ అసెంబ్లీ సమావేశాలలో ఆయన భావోద్వేగానికి గురయ్యారు.
రాష్ట్రపతి ప్రసంగం కొత్త ఒరవడికి నాంది పలికిందన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విపక్షాలు అనాలోచితంగా విమర్శలు చేస్తున్నారని, ఇండి కూటమి చీలికలతో కొట్టుమిట్టాడుతోందన్నారు లక్ష్మణ్. కాంగ్రెస్ ఎంపీ దక్షిణ భారత ను విభజించాలని మాట్లాడుతున్నాడని, నారీ శక్తి కి ప్రోత్సాహించేలా ప్రసంగం ఉందన్నారు లక్ష్మణ్. అంతేకాకుండా.. మోడీకి ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న ప్రసంశలను తట్టుకోలేక పోతుంది కాంగ్రెస్ పార్టీ అని ఆయన వ్యాఖ్యానించారు. రాహుల్ యాత్ర భారత్ జోడో చేస్తుంటే…
Arvind Kejriwal: ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. తనను బీజేపీలో చేరాలని బలవంతం చేస్తు్న్నారని సంచలన ఆరోపణలు చేశారు. అయినా కూడా తాను ఒత్తిళ్లకు లొంగబోనని తేల్చి చెప్పారు. ఆప్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని కేజ్రీవాల్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈ కేసును ఢిల్లీ క్రైం బ్రాంచ్ విచారిస్తోంది. ఇప్పటికే కేజ్రీవాల్‌కి నోటీసులు జారీ చేసింది. అయితే ఈ విచారణ మధ్యే కేజ్రీవాల్ ఈ ఆరోపణలు చేయడం…
మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో మంత్రులు జైల్లో ఉన్నారని వ్యాఖ్యానించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యూపీఏ హయాంలో 12 లక్షల కోట్లు దోపిడీ చేశారన్నారు. మోడీ విద్యుత్ కోతలు లేకుండా చర్యలు తీసుకున్నారని ఆయన వెల్లడించారు. 2047 నాటికి పేదరికం లేని దేశంగా… అభివృద్ధి చెందిన దేశంగా నిర్మించుకుందామని, మెజార్టీ పార్లమెంట్ సీట్లు బీజేపీ గెలవడం ఖాయమన్నారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ గెలినేది లేదు.. ఇచ్చిన హామీలు అమలు చేసేది…