BJP leader Ranjith Srinivasan Murder Case: కేరళ సెషన్స్ కోర్టు మంగళవారం (జనవరి 30) సంచలన తీర్పు ఇచ్చింది. బీజేపీ నేత రంజిత్ శ్రీనివాసన్ హత్య కేసులో మావెలిక్కర అదనపు సెషన్స్ కోర్టు 15 మంది నిందితులకు ఉరిశిక్ష విధించింది. నిందితులు అందరూ ఇస్లామిస్ట్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)కు చెందిన వారు కావడం గమనార్హం. కేరళలో రెండేళ్ల క్రితం బీజేపీ నేత రంజిత్ హత్య కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.…
ప్రధాని మోడీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జన ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలే దేశానికి చివరి ఎన్నికలంటూ ఖర్గే హాట్ కామెంట్స్ చేశారు. ఒడిశాలోని భువనేశ్వర్‌లో కాంగ్రెస్ కార్యకర్తలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధానిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోడీ మళ్లీ అధికారంలోకి వస్తే.. ఇకపై ఎన్నికలు జరగవని అన్నారు. కాబట్టి ప్రజలు వచ్చే ఎన్నికల్లో అప్రమత్తమై ఓటేయాలని కోరారు. మోడీ గనుక మళ్లీ గెలిచి అధికారంలోకి వస్తే నియంతృత్వమే రాజ్యమేలుతుందని…
సార్వత్రిక ఎన్నికల్లో ఈసారి ఎలాగైనా బీజేపీని దెబ్బకొట్టాలన్నారు. వ్యతిరేక ఓట్లు చీలకూడదంటే విపక్షాలన్నీ ఏకధాటిపైకి రావాలనుకున్నాయి. అంతే తడువుగా ఆయా రాజకీయ పక్షాలు ఏకతాటిపైకి వచ్చి ఇండియా కూటమిగా ఏర్పాడ్డాయి. అంతేకాదు ఆయా రాష్ట్రాల్లో సమావేశాలు పెట్టి భవిష్యత్ కార్యాచరణపై కూడా చర్చించుకున్నాయి. సీట్లు సర్దుబాటు.. క్యాంపెయిన్, తదితర అంశాలపై బాగానే మేథోమదనం చేశాయి. ప్రజల్లో ఒక విధమైన సానుకూల పవనాలు కూడా వీచాయి. ఇంతలో కూటమి తీసుకున్న ఓ నిర్ణయం ఒక్క కుదుపు కుదిపి మూడు…
బీహార్‌లో నితీష్‌కుమార్ సారథ్యంలో బీజేపీ-జేడీయూ కూటమి ఆదివారం కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్, ఆర్జేడీ, లెప్ట్‌పార్టీల కూటమి నుంచి బయటకు వచ్చి కమలం పార్టీతో మద్దతు మరోసారి నితీష్‌కుమార్ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నారు. ఈ సందర్భంగా నితీష్ తీరుపై ఇండియా కూటమిలోని పలు పార్టీలు దుమ్మెత్తిపోశాయి. ఆయన తీరును తీవ్రంగా ఖండించాయి.
బీజేపీ మహిళ స్వయం సహాయక సంఘాలు, ఎన్జీఓస్ సంపర్క్ అభియాన్ ఆధ్వర్యంలో హయత్ నగర్ లోని ఓ హాల్ లో నిర్వహించిన కార్యశాల కార్యక్రమానికి కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. 1998లో స్వయం సహాయక సంఘాల కాన్సెప్ట్ ను వాజ్‌పేయి ప్రవేశ పెట్టారన్నారు. ఇప్పుడు వేలాది స్వయం సహాయక సంఘాల ఏర్పడ్డాయని, ఎన్ని కోట్ల సంఘాలు ఏర్పాటు చేసినా సాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం…
Mallikarjun Kharge: సీఎం నితీష్ కుమార్ ఇండియా కూటమిని వదిలి, బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగిందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జన ఖర్గే ఆరోపించారు. జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ ఇండియా కూటమిని చీకట్లో ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ, జేడీయూ కలిసి ఇండియా కూటమిని విచ్ఛిన్నం చేయడానికి ప్లాన్ చేశారని ఆదివారం దుయ్యబట్టారు.
Hanuman Flag: కర్ణాటకలో మరో వివాదం చెలరేగింది. మాండ్యా జిల్లాలో అధికారులు హనుమాన్ జెండాను తొలగించడం వివాదాస్పదమైంది. జిల్లాలోని కెరగోడు గ్రామంలో హనుమాన్ జెండాను తొలగించడం ఇప్పుడు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్‌గా మారింది. గ్రామస్తులంతా ప్రభుత్వానికి, అధికార కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నిరసన, ఆందోళనలకు దిగారు. నిన్న ప్రారంభమైన ఈ ఆందోళనలు, ఈ రోజు కూడా కొనసాగించేందు ప్లాన్ చేశారు.
హిందూ మతం గురించి మాట్లాడే బండి సంజయ్ కు రాజకీయాలెందుకని, మఠం పెట్టుకుంటే చాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై బండి సంజయ్ తీవ్రస్థాయిలో స్పందించారు. ‘‘24 గంటలు తాగి పండే మీ అయ్యకు సీఎం పదవెందుకు? బార్ పెట్టుకుంటే చాలదా? నిత్యం మసీదులు, ముస్లింలని మాట్లాడే నీకు రాజకీయాలెందుకు మసీదు ఏర్పాటు చేసుకుంటే సరిపోదా?’’ అంటూ ఎద్దేవా చేశారు. కేటీఆర్ కు కండకావరమెక్కి మాట్లాడుతున్నారని, అధికారం పోయినా అహంకారం తగ్గలేదన్నారు. ఈరోజు సాయంత్రం…
PM Modi: బీహార్ ముఖ్యమంత్రిగా 9వసారి నితీష్ కుమార్ ప్రమాణస్వీకారం చేశారు. ఈ రోజు బీజేపీ మద్దతుతో మరోసారి జేడీయూ-బీజేపీ సర్కార్ ఏర్పడింది. ఇదిలా ఉంటే ప్రధాని నరేంద్రమోడీ, సీఎం నితీష్ కుమార్, బీహార్‌లో కొత్తగా కొలువుదీరిన ఎన్డీయే సర్కార్‌కి అభినందనలు తెలియజేశారు.