Deputy CM Narayana Swamy: టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే అంటూ సంచలన ఆరోపణలు చేవారు ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి.. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ.. నన్ను చంద్రబాబు.. నారాయణ స్వామి ఒక బానిస లాగా ప్రవర్తిస్తున్నాడు అంటున్నాడు.. ఎక్సైజ్ ని పెద్దిరెడ్డి చూస్తున్నాడు.. నారాయణ స్వామికి టీ, కాఫీ నీళ్లు దక్కడం లేదు అన్నారు.. నాకు ఇచ్చిన మంత్రి పదవినీ ఎలా చేశానో ప్రజలకు, డిపార్ట్ మెంట్ కు తెలుసు అన్నారు. నేను ఎప్పుడూ బానిసగా ఎవ్వరి కిందా పని చేయడం లేదన్న ఆయన.. చంద్రబాబు.. యూనివర్సిటీలోనే విద్యార్థులను రెండుగా చీల్చాడని మండిపడ్డారు.. చంద్రబాబు మమ్మల్ని అడి పోసుకుంటాడన్న ఆయన.. సీఎం వైఎస్ జగన్ ఎప్పుడు తిరుపతి వచ్చినా ఆయన హెలికాప్టర్ లో నన్ను తిప్పుతాడు.. పెద్దిరెడ్డిని పాపాల పెద్దిరెడ్డి అని చంద్రబాబు అంటున్నాడు.. అవినీతి గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదన్నారు.
Read Also: PM Modi: “కాంగ్రెస్ ఎంత ప్రయత్నించినా యువరాజు లాంచ్ కావడం లేదు”.. రాహుల్ గాంధీపై సెటైర్లు..
ఇక, చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థిని ఎర్ర చందనం స్మగ్లర్ అని చంద్రబాబు అంటున్నాడు అని ఫైర్ అయ్యారు. మా నియోజక వర్గంలో 1200 కోట్లు ఇప్పటి వరకు పనులు చేశాను అని వెల్లడించారు. మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై చంద్రబాబు రాళ్లు వేయించాడని విమర్శించారు. వైఎస్ షర్మిల మధ్య నిషేధం గురించి అడగడం నేను ఆమె విజ్ఞతకే వదిలేస్తానన్న ఆయన.. చంద్రబాబు మద్యపానం పూర్తిగా వదులుతాను అంటున్నారు.. చంద్రబాబు, షర్మిలమ్మ, పురంధేశ్వరి అంతా ఒక్కటే అని ఆరోపించారు. చంద్రబాబు.. కాంగ్రెస్ ఒక్కటేనన్న ఆయన.. నేను అవినీతిపరుడు అని ఆ స్థానం నుండి మార్చితే బాధపడలా? అని ప్రశ్నించారు. సీఎం జగన్ నన్ను ఎంపీగా పొమ్మంటే నేను వెళ్లలేను అని చెప్పా.. ఎమ్మెల్యే కావాలి అని అడిగాన్నారు. ఇక, ఎన్నికల ముందు కొత్త బ్రాండ్ లను ఎందుకు దించామో అధికారుల నుండి వివరణ తీసుకుని చెబుతానన్నారు ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి..