Bandla Ganesh: సినీ నిర్మాత బండ్ల గణేష్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి ఎంపీ స్థానం నుంచి పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు.
ఛండీఘర్ మేయర్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి పాలైంది. దీంతో ఆప్ పార్టీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. మేయర్ ఎన్నికల్లో బీజేపీ మోసం చేసి విజయం సాధించిందని కేజ్రీవాల్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఝార్ఖండ్ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. క్షణక్షణం ఉత్కంఠ కొనసాగుతోంది. హేమంత్ సోరెన్ అరెస్ట్ అయి 24 గంటలు గడుస్తున్నా.. ఇప్పటి వరకు కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారానికి ఇంకా గవర్నర్ ఆహ్వానించలేదు
మనీలాండరింగ్ కేసులో బుధవారం ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. తదుపరి విచారణ కోసం 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు తీర్పును శుక్రవారానికి వాయిదా వేసింది.
బడ్జెట్లో ఏ రాష్ట్రం గురించి ప్రస్తావన ఉండదు.. ఇది దేశ బడ్జెట్ అని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. రాష్ట్రాలకు గత బడ్జెట్లో దీర్ఘకాలం పాటు సున్నా వడ్డీతో రుణాలు ఇచ్చారు.. ఇప్పుడు కూడా కేటాయించారని తెలిపారు. విభజన చట్టంలో పొందుపరిచిన చాలా అంశాలు నెరవేర్చారని.. ఖచ్చితమైన డెడ్ లైన్ అవసరం లేదన్నారు.
ఝార్ఖండ్‌లో మరో రాజకీయ సంక్షోభం తలెత్తబోతుందా? రాష్ట్రపతి పాలన దిశగా అడుగులు పడుతున్నాయా? లేదంటే అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు కమలం వ్యూహం పన్నుతుందా? రాజ్‌భవన్ కేంద్రంగా అసలేం జరుగుతోంది.
పార్లమెంట్ ఎన్నికలపై తెలంగాణ కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోంది. అభ్యర్థుల ఎంపిక కోసం సెలక్షన్ కమిటీని ఏర్పాటు చేశామని వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి. సీఈసీ సమావేశంలో అభ్యర్థులపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని ఆయన తెలిపారు. అంతేకాకుండా… తెలంగాణ ప్రజల హక్కులపై కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆయన పేర్కొన్నారు. రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తామని మోడీ ప్రభుత్వం చెప్పిందని, కానీ.. రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను…
గుంటూరులో బీజేపీ విజయ సంకల్ప సభ నిర్వహించింది. ఈ సభలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పాల్గొని, ప్రసంగించారు. కార్యకర్తల శ్రమతోనే బీజేపీ పార్టీ ఎదిగిందని తెలిపారు. రాష్ట్రానికి 22 లక్షల ఇళ్ళు కేంద్రం మంజూరు చేసిందని అన్నారు. కాగా.. బీజేపీ పార్టీ భాగస్వామ్యంతోనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. కాగా.. రాజధాని లేని రాష్ట్రం ఏపీ అని పేర్కొన్నారు. రాజధాని విషయంలో టీడీపీ డిజైన్లతో కాలక్షేపం చేస్తే వైసీపీ మూడుముక్కల ఆట ఆడుతోందని ఆరోపించారు. రాజధాని…
సార్వత్రిక ఎన్నికల ముందు ఇండియా కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. చంఢీగఢ్‌లో జరిగిన మేయర్ ఎన్నికల్లో ఊహించని పరిణామం ఎదురైంది. తొలిపోరులోనే కూటమి చతికిలపడింది. కూటమి పార్టీలైన కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ కలిసి తొలిసారి చంఢీగఢ్ మేయర్ ఎన్నికల్లో పోటీ చేశాయి. ఈ కూటమికే ఎక్కువ కార్పొరేటర్లు ఉన్నారు. అయినా కూడా ఓటమి చవిచూడాల్సి వచ్చింది. అనూహ్యంగా బీజేపీకి చెందిన మనోజ్ సొంకార్ మేయర్‌గా విజయం సాధించారు.
గతేడాది జూలై నెలలో మహారాష్ట్రలో రాజకీయంగా పెను దుమారం చెలరేగింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) సీనియర్ నేత అజిత్ పవార్ ఎమ్మెల్యేల బృందంతో కలిసి మహారాష్ట్రలో అధికార కూటమిలో చేరారు. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ కూడా ప్రమాణం చేశారు.