PM Modi: రాజ్యసభలో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోడీని కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. ప్రధాని మోడీ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ పరోక్షంగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘కాంగ్రెస్ పార్టీ యువరాజును స్టార్-అప్‌గా ప్రజెంట్ చేసిందని, కానీ నాన్ స్టార్టప్ అని తేలిందని’’ అన్నారు. కాంగ్రెస్ ఎంత ప్రయత్నించిన అతడిని లాంచ్ చేయలేకపోతున్నారని ఎద్దేవా చేశారు.
PM Modi: రాజ్యసభ వేదికగా ప్రధాని నరేంద్రమోడీ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. దళితులు, వెనకబడినవారికి, గిరిజనులకు కాంగ్రెస్ ఎప్పుడూ వ్యతిరేకమని, ఉద్యోగాల్లో ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్లకు జవహర్ లాల్ నెహ్రూ వ్యతిరేకమని ప్రధాని నరేంద్రమోడీ బుధవారం ఆరోపించారు. ఓబీసీలకు ఎప్పుడూ పూర్తి రిజర్వేషన్లు ఇవ్వని కాంగ్రెస్ సామాజిక న్యాయాన్ని బోధించకూడదని అన్నారు. అంబేద్కర్ భారతరత్నకు అర్హడని కాంగ్రెస్ ఎప్పుడూ భావించలేదని ఆయన అన్నారు.
భారత్‌లో ఎన్నికల వాతావరణం మళ్లీ ఊపందుకున్నట్లు కనిపిస్తోంది. ఏప్రిల్‌లో ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, ఇప్పటి వరకు తుది తేదీలను భారత ఎన్నికల సంఘం ప్రకటించలేదు.. ఫిబ్రవరిలోనే ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుంది అనే తప్పుడు వార్తను ఈసీ ఖండించింది.
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది.. దీంతో, పొత్తులపై ఆయా పార్టీలు చర్చలు ముమ్మరం చేస్తున్నాయి.. ఏపీలో ఇప్పటికే బీజేపీ-జనసేన మధ్య పొత్తు ఉందని.. రెండు పార్టీల నేతలు చెబుతున్నారు.. మరోవైపు.. టీడీపీ-జనసేన మధ్య కూడా పొత్తు కుదిరింది
కర్ణాటక (Karnataka) ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah)కు ఆ రాష్ట్ర హైకోర్టు (Karnataka High Court) ఝలక్ ఇచ్చింది. ఓ కేసులో ఆయనకు రూ.10 వేలు జరిమానా విధించింది.
కర్ణాటకలో (karnataka) పరీక్ష సమయాల మార్పుపై (Exam timings) అధికార కాంగ్రెస్-బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఎస్ఎస్ఎల్సీ, ప్రీ యూనివర్సిటీ పరీక్షల సమయాలను సర్దుబాటు చేస్తూ మైనారిటీలను మభ్యపెడుతోందని బీజేపీ ఆరోపించింది.
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఈనెల 10 నుండి మరోసారి యాత్రకు సిద్ధమయ్యారు. ప్రజాహితమే లక్ష్యంగా…. కేంద్ర అభివ్రుద్ధి పథకాలను జనంలోకి తీసుకెళ్లడమే ధ్యేయంగా…. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంపై తిరిగి కాషాయ జెండా ఎగరేయడమే అంతిమంగా ఈ యాత్ర కొనసాగనుంది. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని అన్ని మండలాలను, వీలైనన్ని ఎక్కువ గ్రామాల్లో పాదయాత్ర చేసేలా రూట్ మ్యాప్ ను సిద్ధం చేసుకున్నారు. అందులో భాగంగా కొండగట్టు అంజన్న సన్నిధిలో పూజలు నిర్వహించి…
త్వరలో ఢిల్లీకి వెళ్లనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. పొత్తులపై చంద్రబాబుతో మంతనాలు జరపనున్నారు బీజేపీ ఢిల్లీ పెద్దలు. ఈ నెల 8వ తేదీన చంద్రబాబు ఢిల్లీ వెళ్లే అవకాశం ఉందంటున్నారు.. ఎనిమిదో తేదీన భేటీ కావాలని చంద్రబాబు - పవన్ కల్యాణ్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు.. ఇక, చంద్రబాబు ఢిల్లీ పర్యటన తర్వాత పవన్ కల్యాణ్ కూడా ఢిల్లీకి వెళ్లే ఛాన్స్ ఉందంటున్నారు
ఉమ్మడి పౌర స్మృతి( యూసీసీ ) బిల్లును ఇవాళ ఉత్తరాఖండ్ అసెంబ్లీ ప్రవేశ పెట్టబోతున్నారు. ఇటీవల ఆ బిల్లును రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించింది. భారతీయ పౌరులు అందరికీ ఒకే రకమైన చట్టం ఉండేలా ఈ బిల్లును రూపొందించారు.