BJP Vijaya Sankalpa Yatra: రాష్ట్రంలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఆ లోటును భర్తీ చేసేందుకు బీజేపీ సిద్ధమైంది. అందుకు తగ్గట్టుగానే ఈ నెల 20(మంగళవారం) నుంచి క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహించబోతున్నారు. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రచార రథాలను ప్రారంభించనున్నారు. వచ్చే ఎన్నికల్లో కనీసం 10 లోక్‌సభ స్థానాలు, 35 శాతం ఓటు బ్యాంకు సాధించాలని పార్టీ నాయకత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
బీజేపీ మూడోసారి ఎందుకు అధికారంలోకి రావాలో వివరిస్తూ.. రాష్ట్రానికి సంబంధించి పదేళ్లలో కేంద్రం చేసిన సహకారాన్ని ప్రజలకు తెలియజేస్తామన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో తమ సత్తా చాటాలనే ఉద్దేశంతో రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలు, 119 అసెంబ్లీ నియోజకవర్గాలను కైవసం చేసుకునేందుకు కమలం పార్టీ ప్రణాళిక రచించింది. ఈ మేరకు 17 పార్లమెంట్ స్థానాలను ఐదు క్లస్టర్లుగా విభజించారు. ఆ 5 క్లస్టర్లలో మొత్తం 4 వేల 238 కిలోమీటర్ల మేర రథయాత్రలు నిర్వహించనున్నారు. యాత్ర ముగింపు సభకు ప్రధాని మోదీ హాజరు కానున్నట్టు పార్టీ వర్గాలు ఇప్పటికే తెలిపాయి. విజయ సంకల్ప యాత్రకు రాష్ట్ర ప్రముఖులు నాయకత్వం వహిస్తారు.
Read also: US Strikes Houthi Rebels: హౌతి రెబల్స్ పై మరోసారి అమెరికా దాడి..
ఆయా క్లస్టర్ల పరిధిలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ బండి సంజయ్, ఎంపీ లక్ష్మణ్, డీకే అరుణ, ఈటల రాజేందర్ తదితర పార్టీల సీనియర్ నేతలు పాల్గొంటారు. ప్రధాని మోదీ ప్రభుత్వం పదేళ్లలో సాధించిన విజయాలు, విపక్షాల వైఫల్యాలను విజయ సంకల్ప యాత్రల ద్వారా ప్రజలకు వివరిస్తామన్నారు. బస్సుయాత్రల్లో భాగంగా నిర్వహించే కార్నర్ మీటింగ్ లకు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, కేంద్రమంత్రులు, జాతీయ పార్టీల నేతలు హాజరవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆదిలాబాద్ జిల్లా ముథోల్ వద్ద కుమురం భీమ్ క్లస్టర్ యాత్రను అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ ప్రారంభించనున్నారు. ఈ యాత్ర 21 అసెంబ్లీ నియోజకవర్గాలు, 3 పార్లమెంట్ నియోజకవర్గాల మీదుగా సాగి నిజామాబాద్ జిల్లా బోదన్‌లో ముగుస్తుంది.
Read also: US Strikes Houthi Rebels: హౌతి రెబల్స్ పై మరోసారి అమెరికా దాడి..
వికారాబాద్ జిల్లా తాండూరులో రాజేశ్వరి క్లస్టర్‌ను గోవా సీఎం ప్రమోద్ సావంత్ ప్రారంభించనున్నారు. 28 అసెంబ్లీ నియోజకవర్గాలు, 4 పార్లమెంట్ నియోజకవర్గాల్లో యాత్ర సాగి కరీంనగర్‌లో ముగుస్తుంది. భాగ్యలక్ష్మి క్లస్టర్ యాత్ర భువనగిరి నుంచి ప్రారంభమై మూడు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని 21 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేసి హైదరాబాద్‌లో ముగుస్తుంది. భద్రాచలం నుంచి ప్రారంభమయ్యే కాకతీయ-భద్రకాళి క్లస్టర్ బస్సు యాత్ర మూడు పార్లమెంట్ నియోజకవర్గాలు, 21 అసెంబ్లీ స్థానాలను కవర్ చేసి ములుగు జిల్లాలో ముగుస్తుంది. కృష్ణా నది మఖ్తల్ వద్ద కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కృష్ణమ్మ క్లస్టర్ యాత్రను ప్రారంభించనున్నారు. బస్సు యాత్ర మూడు పార్లమెంట్ నియోజకవర్గాలు, 21 అసెంబ్లీ స్థానాల్లో సాగి నల్గొండలో ముగుస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి.
OG Movie: పవన్ కల్యాణ్ ‘ఓజీ’పై క్రేజీ అప్‌డేట్.. 10 ఏళ్ల విరామం!