Coffee With Youth: వచ్చే లోక్సభ ఎన్నికల్లో మరోసారి మోడీ నేతృత్వంలో అధికారంలోకి రావాలని బీజేపీ పావులు కదుపుతోంది. ఎన్డీయే కూటమి ఈ సారి 543 ఎంపీ స్థానాల్లో 400కి పైగా గెలుచుకోవాలని టార్గెట్గా పెట్టుకుంది. బీజేపీ స్వతహాగా 370 స్థానాలు సాధించాలని అనుకుంటోంది. ఈ నేపథ్యంలో ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్ర వంటి ఎక్కువ ఎంపీ స్థానాలు ఉన్న రాష్ట్రాలను టార్గెట్ చేస్తోంది.
రైతుబంధు పెంచుతారాని కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఇవ్వకుండా ముంచారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. ఇవాళ ఆయన సిద్దిపేటలో మీడియాతో మాట్లాడుతూ.. రఘునందన్ రావు దుబ్బాక ఎమ్మెల్యేగా గెలవలేదు కానీ మెదక్ ఎంపీగా గెలుస్తాడట అంటూ ఆయన సెటైర్లు వేశారు. బీజేపీ వాళ్లు కవిత, కేజ్రీవాల్ లాంటి ప్రతి పక్షా నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని, బీజేపీ వాళ్లు దేవుని పేరుతో వస్తున్నారన్నారు. కేసీఆర్ చేసినన్ని యాగాలు, పూజలు దేశంలో ఎవరు చేయలేదన్నారు…
Rahul Gandhi: బీజేపీ నేతలకు పరోక్షంగా హెచ్చరించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ప్రభుత్వం మారినప్పుడు ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసిన వారిపై పార్టీ చర్యలు తీసుకుంటుందని అన్నారు.
Vasooli Titans: భారత మమిళ క్రికెటర్ పూజా వస్త్రాకర్ ప్రధాని నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్ షా, ఇతర బీజేపీ నేతలను ఉద్దేశిస్తూ, కించపరిచేలా పెట్టిన పోస్టు వైరల్గా మారింది. బీజేపీ నాయకులను హేళన చేస్తూ..‘‘ వసూలీ టైటాన్స్’’ అంటూ ఆమె ఇన్స్టాగ్రామ్లో పోస్టు పెట్టింది. ఈ పోస్ట్ వైరల్గా మారింది. దీనిని ఉపయోగించుకుని కాంగ్రెస్తో పాటు ప్రతిపక్షాలు బీజేపీపై విమర్శలు చేస్తున్నాయి.
Mukhtar Ansari: గ్యాంగ్స్టర్, పొలిటీషియన్ ముఖ్తార్ అన్సారీ నిన్న జైలులో గుండెపోటుతో మరణించాడు. ఉత్తర్ ప్రదేశ్కి చెందిన అన్సారీ ఒకానొక సమయంలో రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పాడు. తనకు అడ్డొచ్చిన వాళ్లకు చావు భయాన్ని చూపాడు. అయితే, ఎప్పుడు యూపీలో యోగి ఆదిత్యనాథ్ పాలనా పగ్గాలు చేపట్టాడో అప్పటి నుంచి గ్యాంగ్స్టర్కు వణుకు మొదలైంది. తాజాగా అన్సారీ మరణంతో ఆయన వల్ల బాధింపడిన కుటుంబాలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి.
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభంపై సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ లేఖ రాశారు. సిరిసిల్ల నేత కార్మికుల బకాయిలను వెంటనే విడుదల చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం ఆర్డర్లు ఇచ్చి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఆదుకోవాలని, విద్యుత్ సబ్సిడీలను కొనసాగించాలని లేఖలో కోరారు.
ఐటీ శాఖకు బీజేపీ సుమారు 4600 కోట్ల రూపాయల పెనాల్టీ కట్టాల్సి ఉందని కాంగ్రెస్ పార్టీ ఆరోపలు గుప్పించింది. ఆ డబ్బును వసూల్ చేసేందుకు బీజేపీకి ఆదాయపు పన్ను శాఖ డిమాండ్ నోటీసు ఇవ్వాలని కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ పేర్కొన్నారు.
Sunitha Kejriwal : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ శుక్రవారం తన వీడియో సందేశాన్ని విడుదల చేశారు. వీడియోను విడుదల చేస్తూ సునీతా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ఆమ్ ఆద్మీ పార్టీ తన కొత్త ప్రచారాన్ని నేటి నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.