Paripoornananda: ఆధ్యాత్మిక గురువు, శ్రీపీఠం వ్యవస్థాపకులు స్వామి పరిపూర్ణానంద ఎన్నికలకు సిద్ధం అవుతున్న విషయం విదితమే.. హిందూపురం లోక్‌సభ స్థానంతో పాటు అసెంబ్లీ స్థానం నుంచి కూడా ఒకేసారి బరిలోకి దిగుతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.. భారతీయ జనతా పార్టీ టికెట్ ఆశించిన ఆయనకు.. టికెట్ రాకపోవడంతో.. ఇండిపెండెంట్‌గానే పోటీకి సిద్ధం అయ్యారు. ఇక, ఈ రోజు శ్రీ సత్యసాయిలో మాట్లాడిన పరిపూర్ణానంద.. హిందూపురం నుంచి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను అని మరోసారి స్పష్టం చేశారు.. అయితే, తనకు బీజేపీ అధిష్టానం మీద గౌరవం ఉంది. నరేంద్ర మోడీ మరోసారి ప్రధానమంత్రి కావాలనేదే నా లక్ష్యం అని స్పష్టం చేశారు.. నా సంకల్పాన్ని వీడబోను అన్నారు.
Read Also: Leopard Attack: ఇంట్లోకి దూసుకొచ్చిన చిరుత.. ఐదుగురిపై దాడి..!
ఇక, హిందూపురం ను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత నాపై ఉందన్నారు పరిపూర్ణానంద.. హిందూపురంలోని రంగనాథ స్వామి ఎదురుగా ఉన్న కొలను వినాయక నిమజ్జనం కోసం పునర్ధరణ పనులు చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేస్తున్న వారు అభివృద్ధి చేస్తామని లిఖితపూర్వకంగా రాసి ఇస్తే ఎన్నికల బరి నుంచి తప్పుకుంటాను అని ప్రకటించారు. నేను రాజకీయంగా ఎదగాలని రాలేదు.. అభివృద్ధి చేయాలన్నదే నా సంకల్పం అన్నారు. బీజేపీ అధిష్టానం నా గురించి ఇప్పటికీ ఆలోచిస్తుంది.. ఇంకా సమయం ఉంది గనుక నాకే ఎంపీ సీటు ఇస్తారని ఆశిస్తున్నాను అని నమ్మకాన్ని వ్యక్తం చేశారు స్వామి పరిపూర్ణానంద.