PM Modi: వాళ్ల సొంతగడ్డపైనే ఉగ్రవాదుల్ని లేపేస్తున్నాం.. ప్రధాని సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాఖండ్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన తమ ప్రభుత్వ హయాంలో మన దేశ భద్రతాబలగాలు ఉగ్రవాదుల్ని వాళ్ల సొంత గడ్డపైనే హతమారుస్తున్నాయని గురువారం అన్నారు. సుస్థిర ప్రభుత్వం ఉండటం వల్ల కలిగే ప్రయోజనాలను దేశ ప్రజలు చూశారని మరోసారి మోడీ సర్కార్ రావాలనే ప్రతిధ్వనులు దేశవ్యాప్తంగా వినిపిస్తు్న్నాయని అన్నారు.
దేశంలో బలహీనమైన, అస్థిర ప్రభుత్వాలు ఉన్నప్పుడల్లా శత్రువులు ప్రయోజనం పొందారని, ఉగ్రవాదం విస్తరించిందని, కానీ బలమైన మోడీ ప్రభుత్వంలో మన బలగాలు వారి సొంత గడ్డపైనే ఉగ్రవాదుల్ని హతమారుస్తున్నాయని చెప్పారు. అవినీతిపరులు దేశాన్ని దోచుకోకుండా అడ్డుకున్నానని, అందుకే తనపై వారంతా కోపంగా ఉన్నారని అన్నారు. భారత్ గతంలో కన్నా బలంగా మారిందని, త్రివర్ణ పతాకం యుద్ధప్రాంతంలో భద్రతకు హామీగా మారిందని ఉక్రెయిన్ యుద్ధంలో భారతీయులను స్వదేశానికి తిరిగి తీసుకురావడం గురించి మాట్లాడారు.
Also Read
- Ram Mandir Trust First CEO: రామ మందిర ట్రస్ట్ సీఈవో రేసులో ఆ నలుగురు.. తొలి CEOపై తుది నిర్ణయం రేపే..
- Mahua Moitra: ఎంపీ మహువా మొయిత్రా భద్రతపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. కారణమిదే!
- Nitin Nabin: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన నితిన్ నబిన్
- Chirag Paswan Death Threat: కేంద్రమంత్రి చిరాగ్ పాస్వాన్‌కు ముప్పు?.. కేంద్రం అలర్ట్
Read Also: Sana Begum: ప్రముఖ నటి భర్తకు గుండెపోటు.. అందుకు క్షమాపణలు చెప్తూ పోస్ట్..!
‘‘నిన్న నేనున భారతదేశ దక్షిణ కొనలో ఉన్న తమిళనాడులో ఉన్నాను. అక్కడి ప్రజలు ఈసారి మోడీ ప్రభుత్వం కావాలని అంటున్నారు. ఈ రోజు నేను హిమాలయాల ఒడిలో బాబా కేథార్ మరియు బద్రీ విశాల్‌ల పాదాల చెంత ఉన్నారు. ఇక్కడ కూడా అదే ప్రతిధ్వనిస్తోంది. మరోసారి మోడీ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. గత 10 ఏళ్లో భారతదేశాన్ని గతంలో కన్నా మెరుగ్గా మార్చాం.’’ అని ప్రధాని మోడీ అన్నారు.
7 దశాబ్ధాల తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేశామని, ట్రిపుల్ తలాక్‌కి వ్యతిరేకంగా చట్టం చేశామని, లోక్‌సభ-అసెంబ్లీలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇచ్చామని, జనరల్ వర్గానికి చెందిన పేదలకు 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చామని ప్రధాని వెల్లడించారు. కాంగ్రెస్ హయాంలో సైనికులకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు కూడా లేవని ఆరోపించారు. భారతీయులు తయారు చేసిన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను మన సైనికులకు అందించింది బీజేపీ ప్రభుత్వమే అని చెప్పారు. నేడు ఆధునిక తుపాకులు, యుద్ధవిమానాలు, విమాన వాహక నౌకల వరకు ప్రతీది దేశంలోనే తయారు చేయబడుతోందని ప్రధాని చెప్పారు.
తాజావార్తలు
-
BCCI Selection Rule: బీసీసీఐ కీలక మార్పు.. ఇకపై 100 కాదు 200 శాతం.. టీమిండియా ఆటగాళ్లకు చుక్కలే!
-
Mirzapur: The Movie: రిలీజ్‌కు ముందే కోట్లు కొల్లగొట్టిన కలీన్ భయ్యా.. మొదటి రోజే అదిరిపోయిన అడ్వాన్స్ బుకింగ్స్!
-
Hamas Crypto Funding: హమాస్‌కు చావుదెబ్బ.. క్రిప్టో నెట్‌వర్క్‌పై FBI మెరుపుదాడి.. రూ. కోట్లలో నిధులు సీజ్!
-
418 Movie: ప్రశాంత్ నీల్ ‘418’కు సెన్సార్ షాక్.. భయపెట్టే సీన్లపైనే అభ్యంతరాలు!
-
Pawan Kalyan Fan: పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో పెను విషాదం.. కరెంట్ షాక్‌తో అభిమాని మృతి!
ట్రెండింగ్
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్‌ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!