వారణాసి లోక్సభ నియోజకవర్గం నుంచి ప్రధాని మోడీ నేడు నామినేషన్ దాఖలు చేశారు. ప్రధాని కాశీ నుంచి మూడోసారి పోటీ చేస్తున్నారు. నామినేషన్ వేయడానికి ఒకరోజు ముందు ప్రధాని మోడీ వారణాసిలో భారీ రోడ్ షో నిర్వహించిన విషయం విదితమే.
ఈ రోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వారణాసి నియోజకవర్గం నుంచి నామినేషన్ వేయనున్న విషయం తెలిసిందే. మూడో సారి అక్కడి నుంచి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఎక్స్ వేదికగా ఒక వీడియోను షేర్ చేశారు.
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో బహిరంగ చర్చకు బీజేపీ యువమోర్చా ఉపాధ్యక్షుడు అభినవ్ ప్రకాశ్ పేరును సోమవారం నామినేట్ చేసింది. భారతీయ జనతా యువమోర్చా ప్రెసిడెంట్ తేజస్వి సూర్య రాహుల్ గాంధీకి రాసిన లేఖలో, 'ఇది రాజకీయ కుటుంబానికి చెందిన వారసులు, సాధారణ యువకులకు మధ్య గొప్ప చర్చ అవుతుంది' అని రాశారు.
వారణాసి నుంచి లోక్సభ ఎన్నికలకు ప్రధాని మోడీ నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ప్రధాని కాశీ నుంచి మూడోసారి పోటీ చేస్తున్నారు. నామినేషన్ వేయడానికి ఒకరోజు ముందు ప్రధాని మోదీ వారణాసిలో భారీ రోడ్ షో కూడా నిర్వహించారు.
ప్రధాని మోడీ వారణాసి లోక్ సభ స్థానానికి నామినేషన్ సమర్పించనున్న.. ఈ కార్యక్రమానికి ఎన్డీయే కూటమిలోని ప్రధాని పార్టీల నేతలను ఆహ్వానించారు. ఇందులో భాగంగా తన నామినేషన్ కార్యక్రమానికి రావాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి మోడీ ప్రత్యేకంగా ఆహ్వానం పంపించారు.
నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో మహబూబ్ నగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాజాగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 12 నుండి 15 స్థానాల్లో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా 3 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందుతానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ వారు ఓటర్లకు డబ్బులు చూపి ప్రలోభాలకు గురి చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో…
బీజేపీ కొత్త శక్తిగా తెలంగాణలో అవతరిస్తుందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని తెలిపారు. ఓటు వేసిన ప్రజలకు, అధికారులకు, రాజకీయపార్టీల కార్యకర్తలకు, మీడియాకు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. ప్రజాస్వామ్యం మరింత బలపడేందుకు ఉపయోగపడుతుంది.. పోలింగ్ శాతం పెరిగిందని చెప్పారు. బీజేపీకి సానుకూల వాతావరణ కనిపించిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణలో కాసేపట్లో లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగియనుంది. అక్కడక్కడా చెదురు ముదురు ఘటనలు మినహా రాష్ట్రంలో పోలింగ్ కొనసాగింది. ఓటర్లు ఉత్సాహంగా తరలి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సాయంత్రం 5గంటల వరకు 61.16 శాతం పోలింగ్ నమోదైంది.
తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. అక్కడక్కడ చెదురుముదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. హైదరాబాద్లోని పాతబస్తీ మీర్ చౌక్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది.
సీఎం రేవంత్ రెడ్డి లోక్ సభ ఎన్నికల్లో ఓటమిని అంగీకరించారని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. ఓటేసేందుకు వెళ్లి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి రాజకీయాల గురించి మాట్లాడారని ఆయన విమర్శించారు.