బీహార్ రాజధాని పాట్నాలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ (బిజెపి) నినాదం ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో ఎలా ఉంది. బీజేపీ 400 సీట్ల దాటడం గురించి, వివిధ అంశాలపై బహిరంగంగా మాట్లాడారు. థర్డ్ ఫేజ్ ఎలక్షన్స్ తర్వాత 'అబ్కీ బార్, 400 పార్' నినాదం వాస్తవరూపం దాల్చిందని ప్రధాని మోడీ పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. రాష్ట్రంలో మూడు గంటల వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 52.30 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.
హైదరాబాద్ లోక్‌సభ అభ్యర్థి కె మాధవి లతకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎం భారత ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. పోలింగ్ బూత్ వద్ద, బురఖా ధరించిన మహిళల గుర్తింపు పత్రాలను తనిఖీ చేయడం, వారి ముసుగును ఎత్తమని కోరారని దీనపై ఎంఐఎం నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. గత లోక్‌సభ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందిన హైదరాబాద్‌లో అసదుద్దీన్ ఒవైసీపై మాధవిలత తలపడుతున్నారు. అమృత విద్యాలయంలో స్వయంగా ఓటు వేసిన…
ఆంధ్రప్రదేశ్‌లో క్రమంగా ఓటింగ్ శాతం నమోదు అవుతోంది.. ఉదయం మందకొడిగా సాగిన పోలింగ్.. క్రమంగా పుంజుకుంది.. ఇక, మధ్యాహ్నం ఒంటి గంట వరకు 40 శాతానికి పైగా పోలింగ్ నమోదు అయ్యింది..
తెలంగాణ వ్యాప్తంలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. రాష్ట్రంలో ఒకట్రెండు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతం జరుగుతున్నట్లు సీఈవో వికాస్‌రాజ్ వెల్లడించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 33.5 శాతం ఓట్లు వచ్చాయి.. ఈ ఎన్నికల్లో అంతకు మించి వస్తాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ ఆయన కొడంగల్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఎన్నికలు మా వందరోజుల పాలనకు రెఫరెండం అని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ కూడా ఈ ఎన్నికలు మోడీ పాలనకు రెఫరెండం అని చెబుతోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సెప్టెంబర్ 17, 2025తో మోడీ 75 ఏళ్లు నిండుతాయని,…
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో జైలుకు వెళ్లిన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కి రెండు రోజుల క్రితం సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
Sandeshkhali: లోక్‌సభ ఎన్నికల ముందు బెంగాల్ లోని సందేశ్‌ఖాలీ చర్చనీయాంశంగా మారింది. పశ్చిమ బెంగాల్లో రాజకీయాలన్నీ దీని చుట్టూనే తిరుగుతున్నాయి. తాజాగా సందేశ్‌ఖాలీ మరోసారి టెన్షన్ నెలకొంది.
సార్వత్రిక ఎన్నికల వేళ ఎన్డీఏ, ఇండియా కూటమి నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ నేతలు తీవ్రంగా విమర్శించుకుంటున్నారు.