PM Modi : ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు అంటే మే 12న పశ్చిమ బెంగాల్ చేరుకున్నారు. ప్రధాని మోడీ నాలుగు బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ పశ్చిమ బెంగాల్‌లోని బరాక్‌పూర్‌లో అకస్మాత్తుగా రోడ్ షో నిర్వహించారు.
నల్గొండ పార్లమెంట్ పరిధిలో పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. పార్లమెంట్ ఎన్నికలకు అధికార యంత్రంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. నల్గొండ లోక్ సభ లో పురుషుల కంటే మహిళ ఓట్లే అధికం ఉన్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీయే తనను మోసం చేసిందని.. నాకు మోసం చేసింది.. సూరత్ ఎంపీ అభ్యర్థి నీలేశ్ కుంభానీ పేర్కొన్నారు. కాం తాను పార్టీకి ద్రోహం చేసినట్లు అంతా అంటున్నారని, కానీ పార్టీయే మొదట తనకు అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీజేపీపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఎన్నికల్లో ప్రభుత్వ ఏర్పాట్లకు కావాల్సిన సీట్లను బీజేపీ గెలుచుకోలేదని కేజ్రీవాల్ జోస్యం చెప్పారు.
PM Modi: మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చీఫ్ నానా పటోలే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అయోధ్యలోని రామ మందిరాన్ని శుద్ధి చేస్తామని అన్నారు.
ఎన్నికల్లో బీజేపీని ఓడించి పాతిపెడితే దేవుడికి ఏమీ పట్టదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు శనివారం అన్నారు. ‘బీజేపీ నేతలు ఎప్పుడూ శ్రీరాముడి గురించే మాట్లాడతారు. మనం కూడా శ్రీరాముని పూజిస్తాం. హుజూరాబాద్‌లో జరిగిన రోడ్‌షోలో ఆయన మాట్లాడుతూ ప్రజలకు పండుగలు, ఇతర సంప్రదాయాలతోపాటు అన్నీ నేర్పిస్తున్నారని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ప్రజల పక్షాన పోరాడి మరింత బలంగా పుంజుకుంటాం అని కేటీఆర్ అన్నారు. కరీంనగర్లో మూడు రాజకీయ పార్టీల మధ్య పోటీ నెలకొంది. మాజీ…
Himanta Biswa Sarma: దేశంలో యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ) అమలు చేయడానికి, మథురలో శ్రీకృష్ణ జన్మస్థాన్‌లో గొప్ప ఆలయాన్ని నిర్మించేందుకు లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే 400 సీట్లకు పైగా గెలవాలని అస్సా సీఎం హిమంత బిశ్వ సర్మ శనివారం అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ బీజేపీ చీఫ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. మోడీ ప్రభుత్వం అమలు చేస్తన్నవే మళ్లీ హామీలుగా చెప్తారా? అని, కాంగ్రెస్ మేనిఫెస్టో తెలంగాణ హామీలు అంతా డొల్ల అని ఆయన లేఖలో విమర్శించారు. కాంగ్రెస్ హామీలు, ప్రకటనలు ఆ పార్టీని మరింత దిగజార్చేలా ఉన్నాయని, తెలంగాణ ప్రజలను అవమానించేలా ఉన్నాయన్నారు కిషన్ రెడ్డి. చాలా హామీలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం ఇప్పటికే అమలు చేసిందని, మరికొన్నింటిని అమలు…