BJP: లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది. 543 లోక్సభ సీట్లలో 293 సీట్లను ఎన్డీయే కైవసం చేసుకుంది. 240 సీట్లతో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. 2014, 2019 ఎన్నికల్లో బీజేపీ స్వయంగా మ్యాజిక్ ఫిగర్ 272ని దాటి సీట్లను కైవసం చేసుకుంది.
సార్వత్రిక ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయంతో వరుసగా మూడోసారి ప్రధాని బాధ్యతలు చేపట్టేందుకు నరేంద్రమోదీ సిద్ధమవుతున్నారు. ఇక 2014 తరువాత తొలిసారిగా బీజేపీ మ్యాజిక్ ఫిగర్ 272ను దాటలేక పోయింది. మంగళవారం వెలువడిన ఫలితాల్లో బీజేపీకి సొంతంగా 240 సీట్లు రాగా, మిత్రపక్షాలతో కలిసి ఎన్డీఏ 293 స్థానాల్లో గెలిచింది. ఇప్పుడు ఎన్డీఏ కూటమి పక్షాల మద్దతుతోనే ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో దేశంలో మరో ఐదేళ్లు మోదీ 3.O పాలన సాగనుంది. జూన్ 9వ…
కేంద్రంలో మూడోసారి ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు కొనసాగుతున్న వేళ బీజేపీ అగ్రనేతలు సమావేశమయ్యారు. కేంద్ర మంత్రివర్గ కూర్పు, కూటమి పక్షాలతో సమన్వయంపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో చర్చిస్తున్నారు.
లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత బీజేపీకి సీట్లు తగ్గడంపై సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి. నిన్న మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తన రాష్ట్రంలో బీజేపీ పని తీరుకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు.
భారత్ లోక్ సభా ఎన్నికలపై అంతర్జాతీయ మీడియా ఎంతో ఆసక్తిగా స్పందించింది. మోడీ తిరుగులేని మెజారిటీ సాధించలేకపోయినప్పటికీ, మూడోసారి అధికారం చేపట్టేందుకు సిద్దంగా ఉన్నారని పేర్కొన్నారు. భారత్ ఆర్థిక వృద్ధి, అంతర్జాతీయ వేదికపై గళం వినిపించడం, సంశోభలపై వేగంగా స్పందించడం వంటి చర్యలతో చురుకుగా వ్యవహరిస్తోంది. అంతర్జాతీయ మీడియా ఎలా స్పందించిందో తెలుసుకోవడానికి, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ చూడండి.
తిరుపతి ఎంపీ సీటుపై బీజేపీలో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.. తిరుపతి పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సీట్లు గెలిచినా.. ఎంపీ సీటు ఓడిపోవడానికి గల కారణాలపై అన్వేషణ మొదలుపెట్టారు పార్టీ నేతలు.. దీనికి ప్రధాన కారణం.. కూటమి నుండి క్రాస్ ఓటింగ్ జరగడమే అనే నిర్ధారణకు వచ్చారట.
Sanjay Raut: లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీ ఘోరమైన ఫలితాలు వచ్చాయి. అధికారంలో ఉన్న పార్టీకి ఈ స్థాయిలో ఫలితాలు రావడం ఎవరూ ఊహించి ఉండరు. 48 సీట్లు ఉన్న ఆ రాష్ట్రంలో బీజేపీ కేవలం 09 స్థానాలను మాత్రమే కైవసం చేసుకుంది.
ఈ నేపథ్యంలో తెలుగుదేశం, జేడీయూ, శివసేన, ఎల్జేపీ వంటి పార్టీలపై బీజేపీ ఆధారపడాలి. దీంతో ఈ పార్టీల నుంచి విన్నపాలు, కేబినెట్ బెర్తులను, రాష్ట్రాలకు నిధులను డిమాండ్ చేసే అవకాశం ఏర్పడింది.