కేంద్రంలో నరేంద్ర మోదీ సారథ్యంలో మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరనుంది. ఈసారి మోదీ మంత్రివర్గంలో తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి చోటు దక్కింది. వీరిలో మగ్గురు బీజేపీ నాయకులు కాగా.. మరో ఇద్దరు ఎన్డీఏ కూటమిలో కీలకంగా ఉన్న టీడీపీకి చెందినవారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. తాను ఈస్థాయికి వస్తానని అస్సలు ఊహించలేదని అన్నారు. తనపై నమ్మకం ఉంచి తనకు బాధ్యతలు అప్పగించిన మోదీకి, బీజేపీ నాయకత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములం అవుతామన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలు… ఆ తర్వాత అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు తీసుకు వస్తామని హామీ ఇచ్చారు. కరీంనగర్ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. తనను గెలిపించిన కరీంనగర్ ప్రజలు, కార్యకర్తలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.