Annamalai: మోడీ కేబినెట్‌లోకి అన్నామలై..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Annamalai: ప్రధానిగా వరసగా మూడోసారి నరేంద్రమోడీ రేపు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి విజయం సాధించింది. మొత్తం 543 లోక్‌సభ ఎంపీ స్థానాల్లో ఎన్డీయేకి 293 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ సొంతంగా 240 ఎంపీలను గెలిచి, దేశంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. గతంలో స్వతహాగా మెజారిటీ మార్క్ 272ని దాటి బీజేపీ స్థానాలను కైవసం చేసుకోగా, ఈ సారి మాత్రం దాదాపుగా 30 సీట్లకు దూరంలో ఆగిపోయింది. టీడీపీ, జేడీయూ, శివసేన వంటి మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఇప్పటికే దాదాపుగా మోడీ 3.0 ప్రభుత్వంలో కేబినెట్ బెర్తులు ఖరారైనట్లు తెలుస్తోంది.
READ ALSO: Modi swearing: రేపే మోడీ ప్రమాణస్వీకారం.. విపక్షాలకు అందని ఆహ్వానాలు
Also Read
- Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
- CJP Protest: CJP వెనక్కి తగ్గేది లేదు.. ఆదివారం జంతర్ మంతర్‌కు పాదయాత్ర
- Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
- Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
అయితే, తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై ఈసారి మోడీ కేబినెట్‌లో ఉంటారనే వార్తలు వినిపిస్తున్నాయి.తమిళనాడులో బీజేపీకి ఒక్కసీటు రాలేదు, అన్నామలై కూడా కోయంబత్తూర్ నుంచి ఓడిపోయారు. కానీ బీజేపీ ఓట్ల శాతం మాత్రం భారీగా పెరిగింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 3.66 శాతం ఓట్లు వస్తే, 2024లో ఏకంగా ఇది 11.24 శాతానికి పెరిగింది. బీజేపీ మిత్రపక్షాలతో కూడితే ఈ శాతం 18 వరకు ఉంది. ఇదే సమయంలో కాంగ్రెస్ ఓట్ల శాతం 10.67 శాతంగా ఉన్నాయి. అధికార డీఎంకేకి 26.93 శాతం, ప్రతిపక్ష ఏఐడీఎంకేకి 20.46 శాతం ఓట్లు రాగా, మూడో స్థానంలో బీజేపీ ఉంది. చెన్నై సెంట్రల్, చెన్నై సౌత్, కోయంబత్తూర్, కన్యాకుమారి, మధురై, నీలగిరి, తిరునల్వేలి, తిరువళ్లూరు, వెల్లూరు, ధర్మపురి, రామనాథపురం, తేని వంటి నియోజవర్గాలతో పాటు మరో 9 నియోజకవర్గాల్లో బీజేపీ రెండో స్థానంలో నిలవడం గమనార్హం.
ఇదిలా ఉంటే నిన్న జరిగిన ఎన్డీయే సమావేశానికి అన్నామలైకి కూడా ఆహ్వానం అందింది. ప్రధాని మోడీ తన ప్రసంగంలో తమిళనాడులో ఓట్ల శాతం పెరగడాన్ని కూడా ప్రస్తావించడం గమనార్హం. తెలంగాణ, కర్ణాటకలో బీజేపీ ప్రదర్శనను ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రస్తుతం తమిళ మీడియాలో మాత్రం అన్నామలైకి ఖచ్చితంగా కేంద్రమంత్రి పదవి దక్కుతుందని అంచనా వేస్తోంది.
- Tags
- annamalai
- bjp
- NDA
- PM Modi
- Tamil Nadu
తాజావార్తలు
-
Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
-
CJP Protest: CJP వెనక్కి తగ్గేది లేదు.. ఆదివారం జంతర్ మంతర్‌కు పాదయాత్ర
-
Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్.. అక్టోబర్ 19 దరఖాస్తులకు చివరి తేదీ..
-
Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
-
Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!