జాతీయ రాజకీయాల్లో వైసీపీ కొత్త దారులు వెదుక్కుంటున్నట్టు కనిపిస్తోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నంత కాలం బీజేపీతో అంటకాగి, ఆ పార్టీ ఆడించినట్టు ఆడి... ఏది చెబితే దానికి ఓకే చెప్పేసింది వైసీపీ. పార్టీలే వేరు కానీ... బీజేపీ నేతలు మేం వేరు కాదన్నట్టు జాతీయ స్థాయిలో వ్యవహరించింది వైసీపీ. ఒకట్రెండు సందర్భాల్లో మినహా ఎక్కువ, కీలక అంశాల్లో కాషాయ దళానికి ఉభయ సభల్లో బాసటగా నిలిచింది. అలాంటి వైసీపీ... ఓడిపోయాక రూట్ మార్చేసినట్టు కనిపిస్తోందట.
BJP: మహారాష్ట్రలో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే, ఈ ఎన్నికల్లో పొత్తులు కుదుర్చుకోవడానికి శివసేన(యూబీటీ) నేత ఉద్ధవ్ ఠాక్రేతో పాటు ఆయన కుమారుడు ఆదిత్య ఠాక్రే, సంజయ్ రౌత్ నిన్న ఢిల్లీలో పర్యటించారు. కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో సమావేశమయ్యారు.
లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వీడియో నిన్నటి నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి, మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడుతున్నప్పుడు రాహుల్ గాంధీ నిద్రపోతున్నారని అధికార పార్టీ వాదిస్తోంది.
Viral Video: ఈ రోజు లోక్సభలో వక్ఫ్ సవరణ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టింది. కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సభలో బిల్లును ప్రవేశపెట్టారు. అయితే, ఈ బిల్లుపై కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, ఎంఐఎం, ఎన్సీపీ(శరద్ పవార్) వంటి ఇండియా కూటమి పార్టీలు బిల్లును వ్యతిరేకిస్తూ ఆందోళన నిర్వహించాయి.
తెలంగాణ ప్రజలు బాగుండద్దు తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం ఏమైనా చేస్తే బీఆర్ఎస్ నేతలకు కళ్ళ మంట లాగ కనిపిస్తుందని రవాణా , బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇవాళ ఆయన భీమదేవరపల్లి మండలం ములకనురులో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా వ్యక్తిగత పర్యటన కాదు.. అధికారిక పర్యటన రాష్ట్ర చీఫ్ సెక్రటరీ తో పాటు ఫైనాన్స్ సెక్రటరీ, ఐటీ, పరిశ్రమలకు సంబంధించిన అధికారులతో పాటుగా అమెరికా వెళ్లి డెలిగేశన్స్ నీ కలుస్తున్నారన్నారు.…
Waqf Bill: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును తీసుకువచ్చింది. ఈ రోజు కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టారు. అయితే, ఈ బిల్లును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు ఆందోళనకు దిగాయి.
వక్ఫ్ బోర్డు మాఫియా వశమైందని అన్నారు. కొత్త బిల్లు ఏ మత సంస్థ స్వేచ్ఛకు భంగం కలిగించలేదని అన్నారు. వక్ఫ్ చట్టం, 1995ను ఏకీకృత వక్ఫ్ నిర్వహణ, సాధికారత, సామర్థ్యం మరియు అభివృద్ధి చట్టంగా పేరు మార్చాలని బిల్లు ప్రతిపాదించింది మరియు సెంట్రల్