వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లులో పలు ప్రతిపాదనలపై విపక్షాల అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
ఈ రోజు పార్లమెంట్ లో తీవ్ర గందరగోళం నెలకొంది. పార్లమెంటరీ వ్యవహారాలు, మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు వక్ఫ్ చట్టం 1995ని సవరించడానికి వక్ఫ్ (సవరణ) బిల్లు 2024ను ప్రవేశపెట్టారు.
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి పాకిస్థాన్ నుంచి మామిడి పండ్లను పంపిందన్న వార్తలపై భారతీయ జనతా పార్టీ మండిపడుతోంది. ఇది పాకిస్థాన్తో 'నీచమైన' సంబంధమని బీజేపీ అభివర్ణించింది.
Waqf Bill : వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై రాజకీయ వేడి నిరంతరం పెరుగుతోంది. కాగా, ఈరోజు లోక్సభలో మోడీ ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టనుంది. మైనారిటీ మంత్రి కిరణ్ రిజిజు ఈ బిల్లును ఉదయం 12 గంటలకు సభలో ప్రవేశపెట్టనున్నారు.
Salman Khurshid: కాంగ్రెస్ నేత, సీడబ్ల్యూసీ సభ్యుడు సల్మాన్ ఖుర్షీద్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్ అవుతోంది. ఇండియాలో కూడా ‘‘బంగ్లాదేశ్ పరిస్థితులు’’ రావచ్చని ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. మంగళవారం ఖుర్షీద్ మాట్లాడుతూ.. ‘‘బయటకు ప్రతీది సాధారణంగా కనిపించొచ్చు. బంగ్లాదేశ్లో ఏం జరుగుతుందో అది భారత్లో కూడా జరగొచ్చు’’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు విరుచుకుపడుతున్నారు.
ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో 12 ఏళ్ల బాలికపై రెండు నెలల క్రితం కామాంధులు సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. బాధితురాలు గర్భం దాల్చడంతో ఆలస్యంగా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
నామినేటెడ్ పోస్టుల భర్తీ టీడీపీకి ఛాలెంజింగ్గా మారింది. పెద్ద ఎత్తున ఆశావహులు ఉండటంతో నామినేటెడ్ పదవుల భర్తీ కత్తి మీద సాములా మారింది. టీటీడీ, ఏపీఎస్సార్టీసీ, ఏపీ ఎండీసీ, ఏపీఐఐసీ, ఏపీ ఎంఎస్ఐడీసీ, పీసీబీ, అప్కాబ్, మార్క్ ఫెడ్, దుర్గ గుడి ఛైర్మన్ వంటి కీలక పదవులకు డిమాండ్ పెరిగింది.
Maharashtra: మహరాష్ట్రలో లోక్సభ ఎన్నికల్లో మంచి ఫలితాలను నమోదు చేసిన కాంగ్రెస్-శివసేన(ఉద్ధవ్)-ఎన్సీపీ(శరద్ పవార్)ల ‘మహా వికాస్ అఘాడీ‘ కూటమి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే మ్యాజిక్ రిపీట్ చేయాలని అనుకుంటోంది.