Champai Soren: ఈ నెల 30న బీజేపీలోకి ఝార్ఖండ్ మాజీ సీఎం..
- బీజేపీలోకి ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపై సోరెన్..
- ఈ నెల 30వ తేదీన అమిత్ షా సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్న చంపై సోరెన్..
- బీజేపీలోకి చంపై సోరెన్ రాకను ధృవీకరించిన అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Champai Soren: ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపై సోరెన్ బీజేపీలో చేరిక ఫిక్స్ అయింది. ఈ విషయాన్ని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ఎక్స్ (ట్వీటర్) వేదికగా సోమవారం అర్ధరాత్రి ఒక పోస్ట్ చేశారు. ఈ నెల 30వ తేదీన (శుక్రవారం) కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో చంపై సోరెన్ కాషాయ కండువా కప్పుకుంటారని పేర్కొన్నారు. ఝార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ తిరిగి బాధ్యతలు స్వీకరించాక చంపైకి జేఎంఎం పార్టీలో ప్రాధాన్యత తగ్గిపోయింది. దీంతో సొంత రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తానని ఇటీవలే ప్రకటించిన జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపై సోరెన్ అనూహ్యంగా తన నిర్ణయం మార్చుకుని.. ఈ క్రమంలో బీజేపీలో చేరనుండడం ఆసక్తికరంగా మారింది.
Read Also: Off The Record : రాష్ట్ర నేతలకు బీజేపీ ఇంచార్జి వైఖరి రుచించడం లేదా..?
Also Read
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
- BrahMos Missile Export: డిఫెన్స్ రంగంలో భారత్ సత్తా.. బ్రహ్మోస్ ఎగుమతులతో గ్లోబల్ మార్కెట్లో దూకుడు
- Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
- Maharashtra Tragedy: బీచ్ ట్రిప్‌లో విషాదం.. నీటిలో మునిగి 8 మంది స్టూడెంట్స్ మృతి..
అయితే, నిన్న (సోమవారం) రాత్రి కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో సమావేశం తర్వాత బీజేపీలో చేరాలని ఝార్ఖండ్ మాజీ సీఎం చంపై సోరెన్ నిర్ణయించుకున్నారని అసోం సీఎం తెలిపారు. కాగా, గత ఫిబ్రవరిలో ల్యాండ్ స్కామ్ కేసులో అరెస్టైన హేమంత్ సోరెన్.. 6 నెలల పాటు జైలుకు వెళ్లే ముందు తన సీఎం పదవికి రాజీనామా చేసి చంపై సోరెన్ కు ఆ బాధ్యతలను అప్పగించారు.. కాగా, 6 నెలలు జైలు శిక్ష అనుభవించిన తర్వాత ఝార్ఖండ్ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత మళ్లీ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ సీఎం పగ్గాలు చేపట్టడంతో.. తీవ్ర మనోవేదనకు గురైనా చంపై సోరెన్.. అప్పటి నుంచి జేఎంఎం పార్టీతో అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. తాజాగా అమిత్ షాతో భేటీ తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది.
Former Chief Minister of Jharkhand and a distinguished Adivasi leader of our country, @ChampaiSoren Ji met Hon’ble Union Home Minister @AmitShah Ji a short while ago. He will officially join the @BJP4India on 30th August in Ranchi. pic.twitter.com/OOAhpgrvmu
— Himanta Biswa Sarma (@himantabiswa) August 26, 2024
తాజావార్తలు
-
Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్!
-
Blood Donation Camp: రక్తదాన శిబిరంలో ‘కులం’ కలకలం.. తమిళనాడులో వివాదం
-
Vaishnav Tej: 100 కోట్ల హిట్టు కొట్టినా.. ‘ఉప్పెన’ హీరో ఏం చేస్తున్నాడు?.. ఇంత గ్యాప్ ఎందుకు?
-
Sardar 2 : కార్తీపై గుర్రుగా ఉన్న తమిళనాడు థియేటర్స్ యాజమాన్యం
-
Samsung Galaxy F08, M08: సామ్ సంగ్ Galaxy F08, Galaxy M08 భారత్‌లో లాంచ్.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?