Bomma Mahesh Kumar Goud: కనిత కు బెయిల్ ఊహించిందే అని ఎమ్మెల్సీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కుతోనే బెయిల్ వచ్చిందని తెలిపారు. మొన్నటి వరకు చీకటి ఒప్పందాలతో కాంగ్రెస్ ను దెబ్బతీయాలని చూశారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు అయ్యి బీజెపీ కి బీఆర్ఎస్ దాసోహం అయ్యిందన్నారు. హరిష్, కేటీఆర్ లు ఢిల్లీలో బీజేపీ నేతల చుట్టూ ఆపద మొక్కులు మొక్కారని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతల ఇళ్ల చుట్టూ తిరిగి కాళ్ళ మీద పడి కవితకు బెయిల్ తెచ్చుకున్నారన్నారు. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి.. బీజేపీ, బీఆర్ఎస్ లు కుమ్మక్కు రాజకీయాలు బయటపడ్డాయన్నారు. బీజేపీ లో బీఆర్ఎస్ విలీన ప్రక్రియ మొదలు అవుతుందన్నారు. ఇంకా బీజేపీ లో బీఆర్ఎస్ విలీనం ఒక్కటే మిగిలిందని తెలిపారు.
Read also: MLC Madhusudanachary: కవితను ఐదు నెలలు కుట్రతో జైలులో పెట్టారు..
ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ సీబీఐ, ఈడీ కేసుల్లో కవితకు బెయిల్ మంజూరు చేసింది ధర్మాసనం. పలు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. ఇవాళ ఎట్టకేలకు సాయంత్రం 5 గంటల లోపు కవిత విడుదల కానున్నారు. రూ.10 లక్షల విలువైన 2 షూరిటీలు సమర్పించాలని సుప్రీం ఆదేశించింది. సాక్షులను ప్రభావితం చేయొద్దని తెలిపింది. కవిత పాస్‌పోస్ట్ ను అప్పగించాలని సుప్రీంకోర్టు తెలిపింది. కవిత బెయిల్ కు 3 ప్రధాన కారణాలు సుప్రీం కోర్టు తెలిపింది. మహిళకు ఉండే హక్కులను కూడా పరిగణించాల్సిన అవసరం ఉందని ధర్మాసనం పేర్కొంది. నిందితురాలని జైలులో ఉంచాల్సిన అవసరం లేదని తెలిపింది. సీబీఐ తుది ఛార్జ్‌షీట్ దాఖలు చేసిందని, ఈడీ ఛార్జ్ షీట్ వేయలేదని తెలిపింది. ఇక ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో 166 రోజులు కవిత తిహార్ జైలులో ఉన్న విషయం తెలిసిందే.
MLC Kavitha: ఇవాళ జైలు నుంచి కవిత విడుదల..