Swati Maliwal Assault Case: లోక్‌సభ ఎన్నికల సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత, రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ దాడి చేయడం సంచలనంగా మారింది. కేజ్రీవాల్ నివాసంలోనే ఆమెపై దాడికి పాల్పడ్డాడు. మే 13న దాడి జరిగితే మే 18న బిభవ్ కుమార్‌ని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే, దాదాపు 100 రోజలు తర్వాత బెయిల్ లభించింది. అతడికి సుప్రీంకోర్టు ఈ రోజు బెయిల్ మంజూరు చేసింది. ఈ రోజు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు.. బిభవ్ కుమార్‌ని మళ్లీ పర్సనల్ పీఏగా చేర్చుకోవద్దని, ముఖ్యమంత్రి కార్యాలయంలో అధికారి నియామకం చేయరాదని ఆదేశించింది.
Read Also: CM Revanth Reddy: మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు.. ఎకరాకు రూ.10 వేలు పరిహారం
సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఆయన పీఏ బిభవ్ కుమార్ స్వాతి మలివాల్‌పై దాడి చేశాడు. తనను బిభవ్ ఏడు సార్లు చెంపపై కొట్టడమే కాకుండా, సున్నిత భాగాలపై కడుపులో తన్నాడని ఆమె ఆరోపించింది. ఈ కేసులో పోలీసులు, ఫోరెన్సిక్ టీం కేజ్రీవాల్ నివాసంలో సాక్ష్యాలు సేకరించారు. ఈ కేసులో జాతీయ మహిళా కమిషన్ బిభవ్ కుమార్‌ని తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది.
ఆ సమయంలో ఈ కేసుపై ఆప్ స్పందిస్తూ.. ఆమె బీజేపీకి బంటుగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ముందస్తు అపాయింట్‌మెంట్ లేకుండా మే 13న కేజ్రీవాల్ నివాసానికి ఆమె వచ్చారని ఆప్ మంత్రి ఆతిషీ ఆరోపించారు. స్వాతి మలివాల్‌ని వెయిటింగ్ రూంలో వేచి ఉండాల్సిందిగా చెప్పినా కూడా ఆమె ఆగకుండా డ్రాయింగ్ రూంలోకి ప్రవేశించిందని, ఆమెను అడ్డుకునేందుకు బిభవ్ కుమార్ వచ్చారని అతిషీ పేర్కొన్నారు. ఇదంతా బీజేపీ ప్లాన్ అని ఆమె ఆరోపించారు. మరోవైపు ఈ వ్యవహారంపై బీజేపీ ఆప్‌ని టార్గెట్ చేస్తోంది. సీఎం కేజ్రీవాల్ నిందితుడు బిభవ్ కుమార్‌ని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నాడని బీజేపీ ఆరోపించింది.