Robert Vadra: కంగనా రనౌత్‌కు పార్లమెంటుకు వెళ్లే అర్హత లేదు..
- బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ పై రాబర్ట్ వాద్రా సీరియస్..
- కంగనా పార్లమెంటుకు వెళ్లే అర్హత లేదంటూ విమర్శలు..
- మొదట మహిళల భద్రత కోసం కంగనా ఆలోచించాలి: రాబర్ట్ వాద్రా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Robert Vadra: భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యురాలు కంగనా రనౌత్ పై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా ఈరోజు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రైతులపై కంగనా చేసిన వ్యాఖ్యలను రాబర్ట్ ఈ సందర్భంగా మండిపడ్డారు. కంగనా రనౌత్ ఒక మహిళ కాబట్టి నేను ఆమెను గౌరవిస్తాను.. కానీ, ఆమెకు పార్లమెంటులో ఉండే అర్హత లేదని భావిస్తున్నాను అని అన్నారు. ఆమె చదువుకోలేదు, ప్రజల గురించి ఆలోచించే పరిస్థితిలో ఆమె లేదని నేను అనుకుంటున్నాను అని చెప్పుకొచ్చారు. ఎంపీ కంగనా మహిళల గురించి ఆలోచించాలి అన్నారు. మహిళల భద్రత విషయంలో దేశమంతా ఒక్కతాటిపైకి రావాలన్నదే నా విజ్ఞప్తి.. మహిళల భద్రత అత్యంత కీలకమైన అంశంగా అభివర్ణించారు.. దాన్ని పరిష్కరించేందుకు అన్ని రాజకీయ పార్టీలు ఏకతాటిపైకి రావాలని రాబర్ట్ వాద్రా సూచించారు.
Read Also: Viral Video: 14నెలల కిందట కిడ్నాప్.. కిడ్నాపర్ ను వదిలిరానంటూ బాలుడి ఏడుపు
Also Read
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
- Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
కాగా, హిమాచల్ ప్రదేశ్‌లోని మండి ఎంపీ రనౌత్ సోమవారం ఒక ఇంటర్వ్యూ క్లిప్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. రద్దు చేయబడిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల నిరసనలపై కంగనా మాట్లాడుతూ.. భారతదేశంలో “బంగ్లాదేశ్ లాంటి పరిస్థితి” తలెత్తవచ్చు.. కానీ భారత్ లో బలమైన ప్రభుత్వం ఉండటం వల్ల అలా జరగలేదని వ్యాఖ్యనించింది. రైతుల ఆందోళనలో మృతదేహాలు వేలాడుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయని ఆరోపించింది. ఈ “కుట్ర”లో చైనా, యునైటెడ్ స్టేట్స్ ప్రమేయం ఉందని కూడా కంగనా రనౌత్ ఆరోపించారు. ఈ కామెంట్స్ పై ప్రతిపక్ష పార్టీలు, రైతు సంఘాలు తీవ్ర స్థాయిలో బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ పై విమర్శలు గుప్పించాయి.
తాజావార్తలు
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
-
Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
-
Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!