శివసేన (యూటీబీ) నేత సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత అసెంబ్లీ గడువు ముగిసినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటులో మహాయుతి కూటమి ఫెయిల్ అయిందని విమర్శలు గుప్పించారు. ఈ మేరకు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను విధించాలని డిమాండ్ చేశారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరనేదానిపై కొనసాగుతున్న ఉత్కంఠ. ఈ సస్పెన్స్ ఈరోజు (బుధవారం) ఉదయం వీడే ఛాన్స్ ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతో సంప్రదింపులు జరిపిన తర్వాత ఏక్నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్లు భేటీ అవుతారని శివసేన(షిండే) నేత సంజయ్ శిర్సత్ పేర్కొన్నారు.
Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. ఇవాళ (బుధవారం) ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పవన్ భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ఏపీకి రావాల్సిన నిధులు, విభజన అంశాలు, కేంద్ర ప్రభుత్వ సహకారంపై ప్రధానితో ఆయన చర్చించనున్నారు.
Maharashtra Election Results: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి ‘‘మహాయుతి’’ సంచలన విజయం సాధించింది. రాష్ట్రంలోని మొత్తం 288 సీట్లకు గానూ ఏకంగా 233 సీట్లను కైవసం చేసుకుని తిరుగులేని ఆధిక్యం ప్రదర్శించింది. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష ఇండియా కూటమి( మహా వికాస్ అఘాడీ) కేవలం 49 సీట్లకు మాత్రమే పరిమితమైంది.
Rahul Gandhi: కాంగ్రెస్ నేత, పార్లమెంట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ వివాదానికి కేంద్రంగా మారారు. పార్లమెంట్లో ఈ రోజు జరిగిన రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని అగౌరపరిచారని బీజేపీ మండిపడుతోంది. మంగళవారం జాతీయ గీతాలాపన సమయంలో కూడా కాంగ్రెస్ నేత సరిగా ప్రవర్తించలేదని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
Bandi Sanjay : జేఎన్జే జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీకి కేటాయించిన ఇండ్ల స్థలాలను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పును వెలువరించడం అత్యంత బాధాకరమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. అత్యున్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పును గౌరవించాచాల్సిందే. అయితే జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు దక్కకపోవడానికి పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీతోపాటు ప్రస్తుత కాంగ్రెస్ పాలకులే ప్రధాన కారణం. 17 ఏళ్ల క్రితం పుస్తెలు తాకట్టు పెట్టి, అప్పు చేసి ఒక్కో జర్నలిస్టు…
Telangana BJP: భారత రాజ్యాంగ దినోత్సవం నాడు తెలంగాణ బీజేపీ ఓ ఆసక్తికర పోస్ట్ చేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాజ్యాంగ విలువలను అనుక్షణం కాపాడుతున్నారని చెప్పుకొచ్చింది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యాన్ని నిరసిస్తూ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నానా పటోలే రాజీనామా చేసినట్లు ఉదయం నుంచి వార్తలు హల్చల్ చేశాయి.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిపై కేంద్రమంత్రి రాందాస్ అథవాలే కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ అవుతారని వ్యాఖ్యానించారు.