బీజేపీకి భారీ షాక్ తగిలింది. మాజీ ఎంపీ సోయం బాపు రావు కాంగ్రెస్ లో చేరారు. బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ కండువు కప్పుకున్నారు. ఆయనతో పాటుగా అత్రం సక్కు కూడా హస్తం గూటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “బీజేపీ కి రాజీనామా చేశా. రేవంత్ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్శితున్ని అయ్యాను. అన్నీ మతాలను నేను గౌరవిస్తాను. కాంగ్రెస్ సిద్ధాంతాలకు కట్టుబడి పని చేస్తా.” అని పేర్కొన్నారు.
READ MORE: Technology: ప్రతి ఆరు నిమిషాలకు ఒక కొత్త టెక్నాలజీ.. పేటెంట్ రైట్స్ కోసం భారీగా దరఖాస్తులు
సోయం బాపు రావు.. తెలంగాణలోని ఆదిలాబాద్‌లోని వజ్జర్‌లో 1969 ఏప్రిల్ 28న జన్మించారు. రాజకీయ ప్రయాణం 2004లో ఆంధ్రప్రదేశ్‌లోని బోథ్ నియోజకవర్గం నుంచిసనసభ సభ్యునిగా (MLA) ప్రారంభమైంది. 2014 ఎన్నికలలో బోథ్ నుంచిలుగుదేశం పార్టీ (TDP) అభ్యర్థిగా పోటీ చేసి రాథోడ్ బాపురావు చేతిలో ఓడిపోయారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. 2018 ఎన్నికలలో బోథ్ నుంచి పోటీ చేసి, మళ్లీ రాథోడ్ బాపు రావు చేతిలో ఓడిపోయారు. అయితే, 2019 భారత సార్వత్రిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ (బిజెపి) అభ్యర్థిగా విజయం సాధించారు. ఆదిలాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్)కి చెందిన గోడం నగేష్‌పై 58,560 ఓట్ల తేడాతో గెలుపొందారు.
READ MORE: MInister Atchannaidu: మిర్చి రైతుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తోంది!