మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి (బీజేపీ, శివసేన, ఎన్సీపీ) కూటమి ఘన విజయం సాధించింది. ఇక బీజేపీ అయితే సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే శక్తి.. సంఖ్యాబలం కలిగి ఉంది. 288 అసెంబ్లీ స్థానాలకు గాను ఏకంగా 132 అసెంబ్లీ స్థానాలను కమలనాథులు కైవసం చేసుకున్నారు.
Eknath Shinde: మహారాష్ట్రలో ముఖ్యమంత్రి పదవి కోసం టగ్ ఆఫ్ వార్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో బీహార్ మోడల్లో సీఎంను నిర్ణయించాలని ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన డిమాండ్ చేస్తుంది. బీహార్లో తక్కువ సీట్లు వచ్చినా భారతీయ జనతా పార్టీ నితీష్ కుమార్ను ముఖ్యమంత్రిని చేసిందని పేర్కొంది.
Sambal Conflict: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సంభల్లో గల జామా మసీదు సర్వే పనుల్లో నెలకొన్న హింసపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ రియాక్ట్ అయ్యారు. ఈ ఘటనలో యూపీ సర్కార్ వైఖరిపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
Maharashtra CM: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి భారీ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు కూటమి నేతలు రెడీ చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరన్నది..? ఓ పెద్ద ప్రశ్నగా మారిపోయింది. సీఎం పదవి కోసం దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే ఇద్దరూ గట్టిగా పోటీ పడుతున్నారు.
Maharashtra PCC: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విపక్ష మహా వికాస్ అఘాడీ ఘోర ఓటమిని చవి చూసింది. ఈ నేపథ్యంలో మరో కీలక పరిణామం జరిగింది. ‘మహా’ ఎన్నికల్లో పార్టీ ఓటమికి పూర్తి బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్ష పదవికి నానా పటోలే రిజైన్ చేశారు.
PM Modi: నేడు (సోమవారం) శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందు పార్లమెంట్ వెలుపల మీడియా పాయింట్ దగ్గర భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. పార్లమెంట్లో ఫలవంతమైన చర్చలు జరగాలని అధికార, విపక్ష సభ్యులను కోరారు.
Maharashtra New CM: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ కొట్టిన నూతన ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతుంది. మహాయుతి కూటమిలోని మూడు పార్టీల నేతలూ ఇందు కోసం గట్టిగా పోటీ పడుతున్నట్లు తెలుస్తుంది.
Sanjay Raut: సంజయ్ రౌత్ ఇప్పుడు ఈ పేరు మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రధానంగా వినిపిస్తోంది. బీజేపీ మిత్రపక్షంగా ఉన్న శివసేన రెండుగా కావడానికి కారణం, ఇప్పుడు ఇంతటి పతనానికి కారణం అతనే అని ఠాక్రే కుటుంబ అభిమానులు, మద్దతుదారులు అనుకుంటున్నారు.
INDIA alliance: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ‘‘మహాయుతి’’ కూటమి సంచలన విజయాన్ని సాధించింది. మొత్తం 288 సీట్లకు గానూ ఏకంగా 233 సీట్లను కైవసం చేసుకుంది. మరోవైపు కాంగ్రెస్, ఎన్సీపీ శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే శివసేనల మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకుంది.
Sanjay Raut: మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే శివసేన(యూబీటీ) దారుణ పరాజయాన్ని మూటకట్టుకుంది. మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ)లో భాగస్వామి అయిన ఉద్ధవ్ సేన 95 సీట్లలో పోటీ చేస్తే కేవలం 20 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. ఇలాంటి ఫలితాలను తాము ఊహించలేదని ఠాక్రే నిరాశనను వెలిబుబ్చారు.