పచ్చ కామెర్లు వచ్చిన వారికి లోకమంతా పచ్చగా కనిపిస్తోంది అన్నాడట.. అచ్చం అలాగే, రాహుల్ ఈ రోజు చేసిన వ్యాఖ్యలకు ఈ సామెతకు సరిపోతుందన తెలిపారు. ఇక, రాహుల్ గాంధీ యూపీఏ ప్రభుత్వంలోని వైఫల్యాలను చూసి, వాటిని ఎన్డీయే సర్కారుకి ఆపాదించడం అతని అవివేకానికి నిదర్శనం అన్నారు. ఉపాధి విషయంలో ప్రత్యేకంగా రాహుల్ కోసం కొన్ని వాస్తవాలను ఇక్కడ తెలియజేస్తున్నాను అని కిషన్ రెడ్డి వెల్లడించారు.
కుల సంఘాలను సర్వేలో పాల్గొనాలి అని చెప్పిన పాల్గొనలేదు.. ఈ సర్వేలో కావాలనే కొంత మంది పాల్గొన లేదు అని ఆయన వెల్లడించారు. సర్వేలో ప్రజలు చెప్పిన సమాచారమే నమోదు చేశాం.. ఇక, ఎస్సీ వర్గీకరణపై సాయంత్రం 7గంటలకు మరోసారి సమావేశం అవుతాము.. కుల గణన సర్వేకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలి అని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పుకొచ్చారు.
దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల ప్రచారం ముగిసింది. గత కొద్ది రోజులుగా ప్రధాన పార్టీలన్నీ ప్రచారాలతో హోరెత్తించారు. విమర్శలు.. ప్రతి విమర్శలతో మాటల యుద్ధం సాగించారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్ మరోసారి మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇంటి దగ్గర హల్చల్ చేసింది. పూర్వాంచల్కు చెందిన కొంతమంది మహిళలతో కలిసి యమునా నది నీళ్లు తీసుకుని కేజ్రీవాల్ ఇంటి దగ్గర నిరసన చేపట్టింది.
TPCC Mahesh Goud : తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా అన్యాయం చేస్తోందని టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ఆరోపించారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర బడ్జెట్లో తెలంగాణను పూర్తిగా విస్మరించారని విమర్శించారు. రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధి కోసం రాజకీయ భేదాలను పక్కన పెట్టి అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. తెలంగాణకు న్యాయం జరిగే వరకు శాంతియుతంగా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.…
ఢిల్లీలో ఈనెల 5న అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. అందుకోసం బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెళ్లారు. షాధ్రాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు చంద్రబాబు. ఆయనతో పాటు కేంద్రమంత్రి మనోహర్ లాల్ కట్టర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
Union Minister Suresh Gopi: ఢిల్లీలో జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచారంలో కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి సంచలన వ్యా్ఖ్యలు చేశారు. గిరిజన వ్యవహారాల శాఖను అగ్ర వర్ణాల వారికి ఇవ్వాలని అన్నారు.
నా మాటలు రాసి పెట్టుకోండి ఢిల్లీ పీఠంపై బీజేపీ పార్టీ జెండా ఎగురవేస్తామని జేపీ నడ్డా అన్నారు. ఇక, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఒక అబద్ధాల ఎన్సైక్లోపీడియా’ అంటూ మండిపడ్డారు.
రవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. తమ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతూ భారతీయ జనతా పార్టీ రౌడీయిజం చేస్తుందని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో మరోసారి ఆప్ విజయం సాధిస్తుందన్నారు. ఇది బీజేపీ నాయకులకు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు నచ్చడం లేదు.. అందుకే మాపై దాడులకు, బెదిరింపులకు దిగుతున్నారని పేర్కొన్నారు.