ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమి తర్వాత.. పంజాబ్ ప్రభుత్వంలో గుబులు మొదలైంది. భగవంత్ సింగ్ మాన్ ప్రభుత్వంలో విభేదాలు తలెత్తినట్లుగా వార్తలు వ్యాప్తి చెందుతున్నాయి.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాన్ని అందుకుంది. 27 ఏళ్ల తర్వాత కాషాయ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. తిరిగి లేని మెజార్టీని కమలం పార్టీ అందుకుంది. అయితే ఇప్పటి వరకు ముఖ్యమంత్రి ఎంపిక జరగలేదు. ఈ విషయంలో కమలనాథులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తోంది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘోరంగా ఓడిపోయింది. కేవలం 22 సీట్లకే పరిమితం అయింది. అంతేకాకుండా ఆప్ అధినేత కేజ్రీవాల్ సహా ముఖ్య నాయకులంతా ఓటమిలో వరుస క్యూ కట్టారు. ముఖ్యమంత్రిగా ఉన్న అతిషి మాత్రం కల్కాజీ నియోజకవర్గం నుంచి స్వల్ప మెజార్టీతో గట్టెక్కారు.
MLC Elections: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. మంత్రులు అందరూ.. ఎమ్మెల్సీ ఎన్నికలను సీరియస్ గా తీసుకోవాలని చెప్పారు.
Anurag Thakur: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. దీనిని ఉద్దేశిస్తూ బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ లోక్సభలో రాహుల్ గాంధీపై సెటైర్లు వేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ట్రాక్ రికార్డుని మరోసారి గుర్తు చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో ఉన్న ఆదాయపు పన్నుపై అనురాగ్ ఠాకూర్ వివరణాత్మకంగా విశ్లేషించారు.
Delhi CM: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించింది. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో కాషాయ పార్టీ అధికారాన్ని చేపట్టబోతోంది. దశాబ్ధకాలంగా ఉన్న ఆప్ అధికారానికి తెరిదించింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 70 అసెంబ్లీ స్థానాలకు గానూ బీజేపీ 48, ఆప్ 22 స్థానాల్లో విజయం సాధించాయి. కాంగ్రెస్ పార్టీ ఒక్క చోట కూడా సత్తా చాటలేకపోయింది. 67 స్థానాల్లో దారుణంగా డిపాజిట్ కోల్పోయింది.
గత ప్రభుత్వం చేసిన అక్రమాలపై విచారణల్లో దర్యాప్తు సంస్థలకు బ్యాంకులు సమాచారం ఇవ్వాలి అని ఏపీ సీఎం చంద్రబాబు కోరారు. కాగా, బ్యాంకులు ఈ విచారణలకి తగిన సహకారాన్ని అందించాలని పేర్కొన్నారు.
బీహార్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి బరువు 25 వేల 1 రూపాయి నాణేలు కార్మికుల సమావేశంలో పాల్గొనేందుకు బీహార్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్ దర్భంగా చేరుకున్నారు. ఈ సమయంలో కార్మికులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇక్కడ అతనికి మిథిల సంప్రదాయం ప్రకారం తలపాగా, దుప్పటి ఇచ్చి స్వాగతం పలికారు. రాష్ట్ర అధ్యక్షుడి ఈ సందర్శనను తనకు జీవితాంతం గుర్తుండిపోయే విధంగా ఏర్పాట్లు చేశారు. తనకు ఒక రూపాయి నాణెలతో త్రాసుపై తూకం వేశారు.…
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘోరంగా ఓడిపోయింది. 27 ఏళ్ల తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చింది. దీంతో ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి ఆదివారం అతిషి రాజీనామా చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే.సక్సేనాను కలిసి రాజీనామాను సమర్పించారు. సోమవారం ఆమె రాజీనామాను ఎల్జీ ఆమోదించారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో కాషాయ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఫలితాలు వచ్చి రెండు రోజులు గడుస్తున్నా.. ఇప్పటి వరకు ఇంకా ముఖ్యమంత్రి ఎంపిక జరగలేదు.