ప్రధాని మోడీ భక్తుడు, బీజేపీ వీర విధేయుడు మయూర్ ముండే మనస్తాపం చెందాడు. మోడీపై ఉన్న అభిమానంతో రూ.1.5లక్షలు వెచ్చించి ఆలయాన్ని నిర్మించాడు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అయితే స్థానిక బీజేపీ నేతల తీరుతో ఇబ్బంది పడుతున్నట్లు వాపోయాడు. దీంతో మయూర్ ముండే కమలం పార్టీకి గుడ్‌బై చెప్పాడు.
Loksabha Elections : ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్‌లో హింస సర్వసాధారణమైపోయింది. ఇదిలా ఉండగా ఆరో విడత పోలింగ్‌కు ముందు శుక్రవారం రాత్రి తూర్పు మిడ్నాపూర్‌లో టీఎంసీ కార్యకర్త హత్యకు గురైనట్లు వార్తలు వచ్చాయి.
Delhi: బీజేపీ మహిళా కార్యకర్త వర్షా(32)ని దారుణంగా హత్య చేశారు. ఫిబ్రవరి 24 నుంచి అదృశ్యమైన తర్వాత ఆమె మృతదేహాన్ని బుధవారం ఢిల్లీలోని నరేలా ప్రాంతంలోని ప్లేస్కూల్‌లో బుధవారం పోలీసులు కనుగొన్నారు. నరేలాలోని స్వతంత్ర నగర్‌లో ఉంటున్న వర్షా అదృశ్యంపై ఆమె తండ్రి విజయ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిబ్రవరి 23న వర్షా తన స్కూటీపై ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఆమె తన వ్యాపార భాగస్వామి సోహన్ లాల్‌తో చివరిసారిగా కనిపించింది.
ఉడిపి కాలేజీ కేసుకు సంబంధించి కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆయన కుటుంబ సభ్యులపై ట్వీట్ చేసినందుకు గానూ బీజేపీ కార్యకర్తపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయబడింది.
గుజరాత్‌లోని వల్సాద్ జిల్లాలోని వాపి పట్టణానికి సమీపంలో ఉన్న ఆలయం నుండి తన భార్య తిరిగి వచ్చేందుకు ఎస్‌యూవీ వాహనంలో వేచి ఉన్న స్థానిక బీజేపీ కార్యకర్తను గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం ఉదయం కాల్చి చంపారని పోలీసులు తెలిపారు.