West Bengal: ఉత్తర బెంగాల్‌లోని నాగరకటలో వరద బాధితులకు సహాయం చేయడానికి వెళ్లిన బీజేపీ ఎమ్మెల్యే శంకర్ ఘోష్, ఎంపీ ఖాగెన్ ముర్ముపై స్థానికులు దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బీజేపీ నాయకులు స్థానిక ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఈ దాడిని అధికార తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) కుట్రగా బీజేపీ అభివర్ణిస్తోంది. ఈ ఘటన జల్‌పాయీగూడీ ప్రాంతంలో సోమవారం చోటుచేసుకుంది.
Bengal Assembly Fight: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో గురువారం ఎక్కడ చూడని సన్నివేశం తారసపడింది. వాళ్లందరూ ప్రజాప్రతినిధులు.. కానీ చిన్నపిల్లలు స్కూల్‌లో దెబ్బలాడుకున్నట్లు ఒకరితో ఒకరు పోట్లాడుకున్నారు. ఈ వీడియోను ఆ రాష్ట్ర బీజేపీ పార్టీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, బెంగాల్‌లో ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని రాసింది. వాస్తవానికి అసెంబ్లీలో ప్రతిపక్ష బీజేపీ, అధికార టీఎంసీ ఎమ్మెల్యేల మధ్య బాహాబాహీ చోటుచేసుకుంది. ఘర్షణ తీవ్ర రూపం దాల్చడంతో మార్షల్స్ ప్రవేశించి.. గొడవను ఆపారు. సభలో జరిగిన గందరగోళం…