Bandi Sanjay: అభివృద్ధి నిధుల పై ముఖ్యమంత్రి చర్చకి వస్తారా? అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ విసిరారు. బీజేపీ మహాజన సంపర్క్ అభియాన్ కార్యకర్తలతో టిఫిన్ బైటక్ కార్యక్రమంలో బండి సంజయ్ పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. కేసీఆర్ సర్కార్ లో ఉన్న మంచి పథకాలని కొనసాగిస్తామని అన్నారు. ధరణి మంచి స్కీం కాని ధరణి కేసీఆర్ కుటుంబానికి అసరాకి మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరణి మంచి కార్యక్రమం… ధరణిలో మార్పులు చేసి కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ లో గెలిచిన వారు బీఆర్ఎస్ లో చేరుతారని వ్యంగాస్త్రం వేశారు.
Read also: New Bride Escape: నగదుతో నవ వధువు ఎస్కేప్.. లబోదిబోమంటున్న కొత్త పెళ్లి కొడుకు
కాంగ్రెస్ లో ముప్పై సీట్లని డిసైడ్ చేసేదే కేసీఆర్ ఏ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్ పార్టీ పై గెలిచిందే బీజేపీ అని వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకీ అదరణ లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకి ఐదు లక్షల కొట్లు ఇచ్చామని తెలిపారు. ముఖ్యమంత్రి ఎన్ని హామీలు ఇచ్చారు, ఎన్ని నెరవెర్చలేదని అన్నారు. రెండు నెలల నుండి పింఛన్ లు ఇస్తలేరు? అంటూ మండిపడ్డారు. ఒకటో తారీఖు జీతాలు ఇవ్వలేని దుస్థితిలో ఉంది కేసీఆర్ సర్కార్ ది అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి నిధులపై ముఖ్యమంత్రి చర్చకి వస్తారా? అంటూ సవాల్ విసిరారు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసారని మండిపడ్డారు. మహమూద్ ఆలీ ఉగ్రవాదులు వచ్చినప్పుడు స్పందించలేదని ఆగ్రమం వ్యక్తం చేశారు. హోం మంత్రి అన్న సంగతి మహమూద్ అలీకి తెలియదు అంటూ ఎద్దేవ చేశారు.
Read also: Rahul Gandhi: ప్రతేడాది ఇస్తామన్న 2కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి.. కేంద్రంపై విరుచుకుపడ్డ రాహుల్
హిందూ మహిళ పుస్తెలతాడులు, బొట్లు తీసివేసినప్పుడు హోం మినిష్టర్ ఎక్కడికి పొయారు? హిందూ మహిళలని హేళన చెయడం కాదా? అంటూ నిప్పులు చెరిగారు. మహమూద్ అలీ ఎవరికి హోం మినిష్టర్? అంటూ ప్రశ్నించారు. కిడ్నాప్ లు, హత్యలు, మహిళలపై దాడులు జరుగుతున్నప్పుడు మహమూద్ అలీ ఎక్కడ పోయాడని బండి సంజయ్ ప్రశ్నించారు. భారతీయ జనతా పార్టీ వ్యక్తుల మీద ఆధారపడే పార్టీ కాదని అన్నారు. జీహెచ్ఎంసీ ఫలితాల మాదిరిగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫలితాలు రాబోతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ సింబల్ మీద పోటీ చేస్తే గెలిచే విధంగా పార్టీని బలోపేతం చేస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తానని కలలు కంటుందని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ చేసుకున్న సర్వేలో నలభై సీట్లు రావడం లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీని కేసిఅర్ లేపాలని ప్రయత్నాలు చేస్తున్నారని, మోడీ హైదరాబాదు కి వస్తే కేసీఆర్ వణుకు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పార్టీ నుండి ఎవరూ బయటికి పోరు అంటూ స్పష్టం చేశారు.
Jan Aushadhi Kendra: ఈ షాపుల్లో 90% చౌకగా మందులు.. ఈ ఏడాది చివరి నాటికి 10000 మెడికల్ స్టోర్లు