Eatala Rajendar: రేపు హైదరాబాద్ కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రానున్నారు. సరూర్ నగర్ స్టేడియంలో బీజేపీ సభకు ఆయన హాజరుకున్నారు. దీంతో సభ ఏర్పాట్లను మల్కాజ్ గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పర్యవేక్షించారు.
రేపు తెలంగాణలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటించనున్నారు. ఖమ్మం జిల్లాలో బీజేపీ నిర్వహించే సభలో ఆయన పాల్గొననున్నారు. రైతు ఘోష బీజేపీ భరోసా బహిరంగ సభలో షా పాల్గొంటారు.
రాష్ట్ర ప్రభుత్వ తప్పుడు విధానాలతో రైతులకు మేలు జరగడం లేదు.. కనీసం ధాన్యం కొనుగోలు చేయడంలో విఫలమైన అసమర్థ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అని కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు.
ఏపీలో లిక్కర్ రాజకీయం నడుస్తోంది. తాము అధికారంలోకి వస్తే రూ.50కే మందు అందిస్తామన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన కామెంట్లు కాక పుట్టిస్తున్నాయి.ప్రజాగ్రహ సభ కాస్త బీజేపీపై ఆ్రగహానికి కారణం అయింది. ఏపీ బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు పేరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తెలుగు మీడియానే కాదు జాతీయ మీడియా సైతం ఆయన ప్రసంగానికి ప్రాధాన్యత ఇచ్చింది. సోము చేసిన వ్యాఖ్యలతో సభ ఉద్దేశం దారి మళ్ళిందంటున్నారు. తమ ప్రభుత్వం…
బీజేపీ సభపై మండిపడ్డారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఆ సబ టీడీపీ అనుబంధ విభాగం సభలా బీజేపీ సభ జరిగింది. రాష్ట్రంలో బీజేపీ లేదు.. అందుకే ప్రజల భావోద్వేగాలు ఏంటో వాళ్ళకు తెలియదు. రాష్ట్రంలో బీజేపీ శక్తి ఏంటో వాళ్ళకూ తెలుసు. చంద్రబాబు డైరెక్షన్ తోనే బీజేపీ సభ జరిగిందన్నారు. రాజకీయాల్లో చంద్రబాబు ఒక మాయా ఫకీరు. దేశ చరిత్రలో మొదటి సారి ఒక జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీ నేతృత్వంలో పని చేయటంచంద్రబాబు గంట…
ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. ఒకవైపు టీడీపీ నిరసనలు, మరోవైపు బీజేపీ సభలతో వైసీపీని టార్గెట్ చేశాయి. అయితే బీజేపీ సభల్ని వైసీపీ నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఏపీలో బీజేపీ సభలు పెట్టడం హాస్యాస్పదం అన్నారు నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ రోజా. ప్రజలు టీడీపీ,బీజేపి మీద ఆగ్రహంగా వున్నారన్నారు. విభజన హామీలను నెరవేర్చకుండా బీజేపీ ఏపీ ప్రజల్ని మోసం చేస్తోందన్నారు. రాష్ర్టం అప్పులు చేస్తుందన్న బీజేపీ….కేంద్రం చేస్తున్న అప్పుల సంగతి గుర్తుకు రావడం లేదా? అని…
బీజేపీ ప్రజాగ్రహ సభ అంటే వైసీపీ, టీడీపీ గుండెల్లో భయం పట్టుకుందన్నారు ఎంపీ సీఎం రమేష్. పేర్ని నాని, పయ్యావుల కామెంట్లు ఆ భయం నుంచి వచ్చినవే. వైసీపీలో ఏం జరుగుతుందో పేర్ని నాని ఆలోచించుకోవాలి. వైసీపీ గౌరవ అధ్యక్షురాలు సహా కార్యకర్తలు.. నేతలు ఏం మాట్లాడుతున్నారో పేర్ని నాని గమనించాలని హితవు పలికారు. వైసీపీలో అంతర్గత పోరు ఉంది. టీడీపీ ప్రతిపక్షంగా ఫెయిలైంది. వైసీపీ చేసిన తప్పులను ప్రజలకు పార్టీ అగ్ర నేతలు ప్రజాగ్రహ సభలో…
ఏపీలో బీజేపీ తీరుపై స్పీకర్ తమ్మినేని సీతారాం మండిపడ్డారు. ప్రజాగ్రహా సభలో విశాఖ స్టీల్ ప్లాంట్ గూర్చి చెప్పాలన్నారు. విద్యార్ది నాయకుడిగా పనిచేసిన నా గుండె రగిలిపోతుంది. ఎందరో సమర యోధులు స్టీల్ ప్లాంట్ కోసం అమరులైయ్యారు. మహానీయుల త్యాగాలు ప్రయివేటైజ్ చేయటానికా సభ. ప్రత్యక్ష ఉద్యమంలో నాడు విద్యార్ది నాయకుడిగా పాల్గొన్నాను. ఖచ్చితంగా రాష్ర్టానికి జరిగిన అన్యాయంపై మాట్లాడాలి. రాష్ర్ట నాయకులంతా మోదీతో , నిర్మలా సీతారామన్ తో మాట్లాడాలి. రాజకీయపార్టీలకు ఎజెండా ప్రాధాన్యతలు ఉంటాయి.…
ఏపీలో సినిమా రంగంపై జగన్ సర్కార్ అనవసర జోక్యం చేసుకుంటోందని మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్. ప్రభుత్వ వైఫల్యాలపై 28వ తేదీన ప్రజాగ్రహ సభ నిర్వహిస్తున్నామన్నారు. కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్ జవదేకర్ ముఖ్య అతిధిగా హాజరవుతారని, రాష్ట్ర ప్రభుత్వం వైఖరి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని ఆహ్వానించామన్నారు. ఆర్ధిక వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం దెబ్బ కొట్టింది. రాష్ట్ర ప్రభుత్వం వనరులు వినియోగించుకోకుండా అప్పులు చేస్తుంది. కాగ్ కూడా అనేక అభ్యంతరాలు లేవనెత్తింది. ఆదాయం సమకూర్చకుండా సంక్షేమానికి…