Eatala Rajendar: రేపు హైదరాబాద్ కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రానున్నారు. సరూర్ నగర్ స్టేడియంలో బీజేపీ సభకు జేపీ నడ్డా హాజరుకున్నారు. ఈ నేపథ్యంలో సభ ఏర్పాట్లను మల్కాజ్ గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పర్యవేక్షించారు. స్థానిక నేతలతో సమావేశమయ్యారు. అనంతరం ఎంపీ ఈటెల మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ లది డ్రామా అని తేలిపోయిందన్నారు. వీళ్లిద్దరూ డ్రామా కంపెనీల వ్యవహరిస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. రేపు ఆటో డ్రైవర్లు సమ్మెకు బీజేపీ మద్దతు ఇస్తోందని స్పష్టం చేశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల వివరాలు నాకు తెలుసని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read also: Kurnool Crime: మిస్టరీ వీడిన తల్లీకూతుళ్ల హత్య కేసు.. వెలుగులోకి విస్తుగొలిపే విషయాలు..
సీఎం రేవంత్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగార్జున సాగర్ రోడ్డు, శ్రీశైలం రోడ్డు ఉండగా ఫార్మా సిటీ కి కొత్త రొడ్డా? అని ప్రశ్నించారు. రేవంత్ రాజులా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నిర్మాణం నగరానికి మెట్రో నా? అని ఎంపీ ప్రశ్నించారు. 2 లక్షల 50 వేల ఇళ్లు కేంద్రం ఇచ్చిందని స్పష్టం చేశారు. వాటినే నిర్మించారు తప్ప కొత్తగా ఇచ్చింది లేదన్నారు. నీ ఇందిరమ్మ కమిటీలు ఎంది? నీ కథ ఏంది? అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధాన ఆవాస్ యోజన? నాట్ ఇందిరమ్మ ఇళ్లు అని ఎంపీ ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read also: Ponnam Prabhakar: కుల సర్వేలో కేసీఆర్, కిషన్ రెడ్డిలు పాల్గొనలేదు..
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజా పరిపాలన విజయవంతమైంది. దీనికి ప్రతిగా కాంగ్రెస్ 6 హామీలు, 66 అబద్ధాల పేరుతో బీజేపీ ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. ఇందులో భాగంగానే ఈ నెల 7న హైదరాబాద్ లోని సరూర్ నగర్ స్టేడియంలో కాంగ్రెస్ ఏడాది పాలనకు వ్యతిరేకంగా బీజేపీ నిరసన సభను నిర్వహిస్తోంది. ఈ సమావేశానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఈ నిరసన సభకు కేంద్రమంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానున్నారు.
Game Changer : అక్కడ సాలీడ్ బుకింగ్స్ అందుకుంటున్న రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’