బీజేపీ సభపై మండిపడ్డారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఆ సబ టీడీపీ అనుబంధ విభాగం సభలా బీజేపీ సభ జరిగింది. రాష్ట్రంలో బీజేపీ లేదు.. అందుకే ప్రజల భావోద్వేగాలు ఏంటో వాళ్ళకు తెలియదు. రాష్ట్రంలో బీజేపీ శక్తి ఏంటో వాళ్ళకూ తెలుసు. చంద్రబాబు డైరెక్షన్ తోనే బీజేపీ సభ జరిగిందన్నారు.
రాజకీయాల్లో చంద్రబాబు ఒక మాయా ఫకీరు. దేశ చరిత్రలో మొదటి సారి ఒక జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీ నేతృత్వంలో పని చేయటంచంద్రబాబు గంట కొట్టగానే ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడులా వచ్చి వెళుతుంటారు.
మాటలు బీజేపీ నేతల నోట్లో, స్క్రిప్ట్ టీడీపీ ఆఫీసు లో తయారు అవుతున్నాయి. చంద్రబాబు ఏజెంట్లుగా సుజనా చౌదరి, సిఎం రమేష్… టీటీడీ ఎజెండాను విజయవంతంగా నడుపుతున్నారు. వీళ్ళిద్దరినీ చూపిస్తు బీజేపీతో పొత్తు పెట్టుకోనున్నాం అని చంద్రబాబు తన నాయకులకు చెబుతున్నారన్నారు సజ్జల.