వికాస్ రావు డాక్టర్ గా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు అని బండి సంజయ్ అన్నారు. మంచి ఆలోచనతో, బీజేపీపై నమ్మకంతో చేరుతున్నందుకు ధన్యవాదాలు.. కిషన్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో కాషాయ జండా ఎగరడం ఖాయం అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అన్నారు.
సినీనటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ బీజేపీ పార్టీలో చేరారు. తరుణ్ చుగ్, కిషన్ రెడ్డిల సమక్షంలో ఆమె కమలం పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా జయసుధ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశంలో జరుగుతున్న అభివృద్ధి చూడటం వల్లే బీజేపీ పార్టీలో చేరినట్లు ఆమె తెలిపారు
దేశంలో అభివృద్ధి జరగాలంచే డబులు ఇంజిన్ సర్కారు రావాల్సిందేనని కేంద్ర మంత్రి బీఎల్ వర్మ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో జరిగిన సీనియర్ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
బీజేపీ పోరాటం చేసింది కాబట్టే తెలంగాణ వచ్చిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పోలింగ్ బూత్ స్థాయి కార్యకర్తలను ఉద్దేశించి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా, ప్రధాని వర్చువల్ గా వర్చువల్ మాట్లాడారు.
47 ఏళ్ల వయస్సు గల వ్యక్తి 26 ఏళ్ల యువతితో ప్రేమలో పడ్డాడు. ఆమెకు మరో వ్యక్తితో పెళ్లి నిశ్చయంతో కావడంతో ఆమెతో కలిసి లేచిపోయాడు. దీనిలో ఏముంది అనుకుంటున్నారా.. అయితే అతను బీజేపీ సీనియర్ నేత కావడం, ఆమె ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ నేత కూతురు కావడమే.
బీజేపీపై టీఆర్‌ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి, టీఆర్ఎస్ లీడర్ దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. ఎన్నికల కౌంటింగ్ అవ్వకముందే బీజేపీ అవాకులు చెవాకులు మాట్లాడుతోందిని రంజిత్ రెడ్డి అన్నారు. ఎన్నికల కౌంటింగ్ ఎందుకు ఆలస్యం అవుతుందని మేము అడుగుతున్నామన్నారు.
NTR: ప్రస్తుతం సినీ రాజకీయ వర్గాలు మొత్తం ఒకదాని గురించే చర్చించుకుంటున్నాయి. అమిత్ షా- ఎన్టీఆర్ మధ్య జరిగిన చర్చ ఏంటా..? అని. ఆదివారం అమిత్ షా, ఎన్టీఆర్ తో భేటీ అయిన విషయం విదితమే.
రేపు సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో జరుగునున్న భారతీయ జనతా పార్టీ బహిరంగ సభకు సంబంధించి ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. వారు మాట్లాడుతూ.. HICC మాదాపూర్ – జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ – రాజ్ భవన్ – పంజాగుట్ట – బేగంపేట్ ఎయిర్పోర్ట్ – పరేడ్ గ్రౌండ్ మరియు పరేడ్ గ్రౌండ్ చుట్టుపక్కల రోడ్లలో ప్రయాణించడం నిషేధించారు. టివోలి X రోడ్ నుండి ప్లాజా X రోడ్ మధ్య రహదారి మూసివేయబడుతుందని తెలిపారు. సికింద్రాబాద్ పరిధిలోని…