తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో పలువురు నేతలు బీజేపీలో జాయిన్ అయ్యారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్, బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్, ఎంపీ ధర్మపురి అరవింద్ పాల్గొన్నారు. విద్యాసాగర్ రావు కుమారుడు వికాస్ రావు, ఆయన సతిమణి దీపా వికాస్ రావు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ మాట్లాడుతూ.. వికాస్ జాతీయ భావాలు గల కుటుంబం నుంచి వచ్చారు అని వ్యాఖ్యనించారు.
Read Also: Reba Monica John: ఆహ కడుపు నిండిపోయింది బంగారం
వికాస్ రావు డాక్టర్ గా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు అని బండి సంజయ్ అన్నారు. మంచి ఆలోచనతో, బీజేపీపై నమ్మకంతో చేరుతున్నందుకు ధన్యవాదాలు.. కిషన్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో కాషాయ జండా ఎగరడం ఖాయం అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అన్నారు. సీఎం కేసీఆర్ కండ కావరంతో వ్యవహరిస్తున్నారు.. విద్యార్థులు, మహిళలపై లాఠీ చార్జ్ చేయిస్తున్నారు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: CM Jagan : రాష్ట్రానికి రక్షణ జగనన్న అంటున్న విద్యార్థులు
తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కునేది కేవలం భారతీయ జనతా పార్టీనే అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. వంట గ్యాస్ సిలిండర్ పై ధరను తగ్గించిన కేంద్ర ప్రభుత్వందే అని ఆయన పేర్కొన్నారు. పేదల గురుంచి ఆలోచించే ప్రభుత్వం మోడీ ప్రభుత్వం అంటూ బండి సంజయ్ వ్యాఖ్యనించారు. తెలంగాణ వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.