NTR: ప్రస్తుతం సినీ రాజకీయ వర్గాలు మొత్తం ఒకదాని గురించే చర్చించుకుంటున్నాయి. అమిత్ షా- ఎన్టీఆర్ మధ్య జరిగిన చర్చ ఏంటా..? అని. ఆదివారం అమిత్ షా, ఎన్టీఆర్ తో భేటీ అయిన విషయం విదితమే. ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఎన్టీఆర్ నటనకు ఫిదా అయిన ఆయన ఎన్టీఆర్ ను పిలిపించుకొని మరి ప్రశంసించారు. ఇక ఇక్కడివరకు బాగానే ఉన్నా ఈ మీటింగ్ లో హాట్ టాపిక్ గా మారాడు. బీజేపీ చీఫ్ బండి సంజయ్. ఎందుకంటే ఆయన నిన్న ఎన్టీఆర్ తో ప్రవర్తించిన తీరు నెటిజన్లకు ఆగ్రహాన్ని తీసుకొచ్చింది. ఆర్ఆర్ఆర్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు కొమరం భీమ్ ముస్లిం టోపీ పెట్టుకున్నాడని, అది తప్పు అని బీజేపీ నేతలతో కలిసి బండి సంజయ్ ఎన్టీఆర్ కు, రాజమౌళికి వార్నింగ్ ఇచ్చాడు.
రజకార్లపై పోరాడిన కొమరం భీమ్ ను ముస్లిం గా చూపిస్తున్నావు.. ఎన్టీఆర్ కనుక ముస్లిం గా కనిపిస్తే ఊరుకొనేది లేదు అంటూ మీడియా ముందే బహిరంగంగా వార్నింగ్ ఇచ్చాడు. ఇక అలాంటిది నిన్న ఎన్టీఆర్ రావడంతో అతనికి వంగి వంగి దండాలు పెడుతూ కనిపించాడు. అంటే అప్పుడు ఉన్న ఎన్టీఆర్ ఇప్పుడు అలాగే ఉన్నాడు. మరి బండి సంజయ్ అప్పుడు ఇచ్చిన వార్నింగ్ ఇప్పుడు ఏమైంది. ఏకంగా అమిత్ షా నే మెచ్చుకొనేసరికి బండి సంజయ్ తగ్గాడా..? ఇదంతా రాజకీయం కోసమేనా.. ? అని బండి సంజయ్ ను ఏకిపారేస్తున్నారు. రాజకీయల్లో తమ పేరును కాపాడుకోవడానికి ఎప్పుడు ఏ గొడుగు పట్టాలో రాజకీయ నేతలకుబాగా తెలుసు.. అందులో బీజేపీ నేతలకు ఇంకా బాగా తెలుసు అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.